అచ్చం ఆ హాలీవుడ్ హీరో లాగే ఉన్నాడే..?

Viral Video Shows Johnny Depp's Lookalike At A Religious Ceremony In Iran. హాలీవుడ్ నటుడు జానీ డెప్‌ను పోలి ఉన్న ఇరాన్ వ్యక్తికి సంబంధించిన వీడియో

By Medi Samrat
Published on : 15 Aug 2022 5:30 PM IST

అచ్చం ఆ హాలీవుడ్ హీరో లాగే ఉన్నాడే..?

హాలీవుడ్ నటుడు జానీ డెప్‌ను పోలి ఉన్న ఇరాన్ వ్యక్తికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వ్యక్తి ఇరాన్‌లోని తబ్రిజ్‌లో జరిగిన మతపరమైన వేడుకలో పాల్గొన్నాడు. ఆ ప్రాంతంలో అతని వీడియో తీయబడింది. ఈ వీడియో మొదట టిక్‌టాక్‌లో కనిపించింది. ఈ ఫుటేజ్ తరువాత Reddit వంటి ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అయింది. చాలా మంది అతడు జానీ డెప్ అనుకుని పొరబడ్డారు. వేలాది మంది ప్రజలు ఆశ్చర్యపోయారు. న్యూస్‌వీక్ ప్రకారం, స్థానిక మీడియా ఆ వ్యక్తిని అమిన్ సాలెస్‌గా గుర్తించింది. అతను మోడల్ అని నివేదికలు పేర్కొన్నాయి.

ఇక సోషల్ మీడియా వినియోగదారులు అతడి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను కూడా కనుగొన్నారు. అతడి సోషల్ మీడియా హ్యాండిల్‌లో.. అతడికి సంబంధించి చాలా ఫోటోలు ఉన్నాయి, అందులో అతను 'పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్' స్టార్ లాగా పోజులిచ్చాడు. జూన్‌లో కూడా అచ్చం జానీ డెప్ లాగా ఉన్న వ్యక్తికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.


Next Story