ఆకాశంలో ఓ వస్తువు.. తీరా చూస్తే దిమ్మతిరిగిపోయింది

టర్కీలో భారీ సుడిగాలులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఆ వైరల్ వీడియోలో సోఫా ఎగిరొచ్చి మరీ పడడం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 May 2023 6:00 PM IST
international news, Sofa, Sky, Turkey, Ankara

ఆకాశంలో ఓ వస్తువు.. తీరా చూస్తే దిమ్మతిరిగిపోయింది

టర్కీలో భారీ సుడిగాలులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఆ వైరల్ వీడియోలో సోఫా ఎగిరొచ్చి మరీ పడడం చూస్తుంటే జనం షాక్ అవుతూ ఉన్నారు. టర్కీ నుండి నివేదించిన వీడియోలో తుఫాను కారణంగా ఆ దేశ రాజధాని అంకారాలో ఫర్నిచర్ ఆకాశంలో ఎగురుతూ కనిపించింది. బలమైన గాలుల కారణంగా ఒక సోఫా ఆకాశంలో ఎగురుతూ మరొక భవనాన్ని తాకింది. దీనికి సంబంధించిన వీడియోను గురు ఆఫ్ నథింగ్ అనే ట్విట్టర్ పేజీ ద్వారా పంచుకున్నారు. వీడియో ప్రారంభంలో ఒక వస్తువు ఆకాశంలో ఎగురుతున్నట్లు కనిపిస్తుంది. కెమెరా జూమ్ చేస్తున్నప్పుడు, అది సోఫా అని ఒక వ్యక్తి గుర్తించాడు. కొన్ని సెకన్లలో బలమైన గాలుల కారణంగా సోఫాను మరొక భవనాన్ని తాకడాన్ని గుర్తించవచ్చు. ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా అనేది ఇంకా ధృవీకరించలేదు.

మే 17న అంకారా నగరంలో తుఫాను పెను విధ్వంసం సృష్టించింది. భారీ గాలులు, వర్షాలు చాలా ప్రాంతాలను తుడిచిపెట్టుకుని పోయేలా చేశాయి. ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు.

Next Story