ఎక్కువసేపు శిక్షణ ఇస్తానని ఆశ చూపి.. విమానంలో కామకేళి
Video Viral of debauchery in flying flight.గురువు స్థానంలో ఉన్న అతడు.. శిష్యురాలిపై కన్నేశాడు. తన కోరిక తీర్చమని
By తోట వంశీ కుమార్ Published on 27 May 2022 10:18 AM ISTగురువు స్థానంలో ఉన్న అతడు.. శిష్యురాలిపై కన్నేశాడు. తన కోరిక తీర్చమని అడిగాడు. ఇందుకు ఆమె అంగీకరించలేదు. అయితే.. విమానం నడపడంలో ఎక్కువ సేపు శిక్షణ ఇస్తానని ఆశ చూపాడు. ఆమె అంగీకరించడంతో విమానాన్ని ఆటో ఫైలెట్ మోడ్‌లో పెట్టి కాక్‌పీట్‌లోనే శృంగార కేళీ సాగించాడు. ఈ విషయం బయటకు రావడంతో సదరు ఫైలట్, ట్రైనీ ఫైలట్‌ను ఫ్లైయింగ్ స్కూల్ తమ అకాడమీ నుంచి బయటకు పంపించి వేసింది. ఈ ఘటన రష్యా దేశంలో జరిగింది.
విమానాలు నడపంలో శిక్షణనిచ్చే పైలట్ (28) ఓ మహిళా ట్రైనీ ఫైలట్(21)కు సెస్నా 172 విమానంలో శిక్షణ ఇస్తున్నాడు. అయితే.. శిక్షణా సమయంలో అతడు.. తన కోరికను తీర్చమని ఆమెను కోరాడు. అయితే.. అతడు పెళ్లైన వాడు కావడంతో ఆమె అందుకు నిరాకరించింది. అయితే.. విమానాన్ని నడపడంతో ఎక్కువ సేపు శిక్షణ ఇస్తానని అతడు చెప్పడంతో ఆమె లొంగిపోయింది. విమానం గాల్లో ఉండడంతో.. ఆటో ఫైలట్ మోడ్ లో పెట్టిన ఫైలట్ ఆమెతో శృంగారంలో మునిగిపోయాడు. అంతేకాదు.. మొబైల్ ఫోన్‌లో తమ రాసలీలలను వీడియో తీసుకున్నారు.
విషయం బయటికి రాకపోను గానీ.. ఆ ట్రైనీ ఫైలట్‌కు తన స్నేహితురాలితో గొడవ జరిగింది. దీంతో సదరు స్నేహితురాలు కోపంతో ఈ వీడియోను లీక్ చేసింది. ఆన్‌లైన్‌లో ఈ వీడియో వైరల్ కావడంతో సాసోవో ఫ్లైట్ స్కూల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అప్రమత్తమైంది. ఇద్దరిని అకాడమీ నుంచి బహిష్కరించింది. దీనిపై తొలుత ట్రైనీ ఫైలట్ మాట్లాడుతూ..తాము శృంగారంలో పాల్గొనలేదని, కేవలం ముద్దులు, కౌగిలింతలకే పరిమితం అయ్యామని తొలుత చెప్పింది. అయితే.. వీడియో బయటకు వచ్చిన తరువాత మాట మారుస్తూ అలా ఒక్కసారే జరిగిందని చెప్పింది.