H1B, H4 (డిపెండెంట్స్) వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం ఇవాళ్టి నుంచి తనిఖీ చేయనుంది. ఈ ప్రక్రియను వెట్టింగ్‌గా పిలుస్తున్నారు. దరఖాస్తుదారులు అంతా సోషల్ మీడియా సెట్టింగులను ప్రైవేట్ నుంచి పబ్లిక్‌లోకి మార్చుకోవాలని యూఎస్ విదేశాంగ శాఖ సూచించింది. ప్రతీ వీసా నిర్ణయం నేషనల్ సెక్యూరిటీ కోణంలోనే ఉంటుందని, ఇక్కడి వచ్చేవాళ్లు దేశ ప్రయోజనాలకు నష్టం కలిగించరని తాము నమ్మాలని పేర్కొంది.
సోషల్ మీడియా వెట్టింగ్.. ఏం చేస్తారంటే?
'నా అకౌంట్.. నా ఇష్టం.. ఏదైనా, ఏమైనా పోస్టు చేస్తా.. కామెంట్ చేస్తా' అంటే యూఎస్‌లో కుదరదు. అలా చేయడం చెల్లుబాటు కాదు. చదువు, ఉద్యోగం కోసం అక్కడికి వెళ్లాలనుకునే వ్యక్తులు ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్, లింక్డిన్ తదితర సోషల్ మీడియా అకౌంట్లలోని పోస్టులు, కామెంట్లను యూఎస్ అధికారులు లోతుగా పరిశీలిస్తారు. గతంలో పోస్టు చేసి.. ఇప్పుడు డిలీట్ చేసినా పట్టేస్తారు. జాత్యాహంకార, లైంగిక, హింసాత్మక, చట్టవిరుద్ధ వ్యాఖ్యలు, యూఎస్‌కు వ్యతిరేక ఆలోచనలు ఉన్నట్టు అనిపిస్తే వీసా రిజెక్ట్ చేస్తారు.