గాభరా పెట్టిన గందరగోళం ట్వీట్

US Strategic Command's Twitter . యూఎస్ మిలిటరీ స్ట్రాటజిక్ విభాగం ట్విట్టర్ ఖాతాను నిర్వహించే స్ట్రాట్ కామ్ వివరణ ఇచ్చింది. యూఎస్ మిలిటరీ స్ట్రాటజిక్ విభాగం ట్విట్టర్ ఖాతాను నిర్వహించే స్ట్రాట్ కామ్ వివరణ ఇచ్చింది.

By Medi Samrat  Published on  31 March 2021 5:52 AM GMT
గాభరా పెట్టిన గందరగోళం ట్వీట్

";l;;gmlxzssaw," ఇది చదివిన వెంటనే ఏదో పొరపాటుగా కీబోర్డ్ ప్రెస్ అయిపోయి టైప్ అయిపోయి ఉంటుంది అని అనుకున్నారు కదా.. కానీ ఇదే ట్వీట్ రూపంలో ఒక ప్రముఖ సంస్థ ట్విట్టర్ అకౌంట్ లో కనిపిస్తే..కొంచం ఆశ్చర్యపోతారు. మరి ఆ అకౌంట్ అమెరికాలో అత్యంత శక్తిమంతమైన యూఎస్ నూక్లియర్ కమాండ్ సెంటర్ వినియోగించేది అయితే.. ఈ సారి మరీ ఎక్కువ ఆలోచిస్తారు కదా..సరిగ్గా అదే జరిగింది.

దేశంలోని అణ్వాయుధాలను నిర్వహించే విభాగం నుంచి ఈ ట్వీట్ రావడంతో పెంటగాన్ హ్యాక్ అయిందా? అని కొందరు, ఇదేమైనా 'యూఎస్ న్యూక్లియర్ లాంచ్ కోడా?' అని మరికొందరు రిప్లయ్ ట్వీట్లు పెట్టారు. ఇక ఈ ట్వీట్ వైరల్ కావడంతో అధికారులు వివరణ ఇచ్చారు.

ఈ ట్వీట్ లో ఎటువంటి సీక్రెట్ మెసేజ్ లేదని చెబుతూ, అసలు విషయంపై యూఎస్ మిలిటరీ స్ట్రాటజిక్ విభాగం ట్విట్టర్ ఖాతాను నిర్వహించే స్ట్రాట్ కామ్ వివరణ ఇచ్చింది. ఈ ఎయర్ ఫోర్స్ బేస్ అమెరికాపై జరిగే ఇతర దేశాల మిసైల్ దాడులను ఎదుర్కొనేందుకు అనుక్షణం సిద్ధంగా ఉంటుంది. అయితే ఈ ట్వీట్ ను మాత్రం తప్పించలేక పోయింది.

ఇంతకీ ఏమైందంటే, ప్రస్తుతం స్ట్రాట్ కామ్ సోషల్ మీడియా ఎడిటర్ కరోనా కారణంగా ఇంటి నుంచి పని చేస్తున్నారు. అతను ఇంట్లో ఈ ఖాతాను ఓపెన్ చేసి, మరో పని నిమిత్తం వెళ్లిన వేళ, అతని కుమారుడు కీ బోర్డ్ పై ఉన్న కీస్ తో ఆటలాడాడు.

అదే సమయంలో కొన్ని కీస్ కొట్టి, ఎంటర్ చేయడంతో అవి ట్విట్టర్ ఖాతాలో అప్ లోడ్ అయ్యాయి. అంతకుమించి ఇంకేమీ లేదని స్టార్ట్ కామ్ అధికారి కెండాల్ కూపర్ వెల్లడించారు. తొలి ట్వీట్ వచ్చిన తరువాత కలకలం రేగగా, కొద్దిసేపటి తరువాత వివరణ ఇచ్చారు. తరువాత ఈ రెండు ట్వీట్లనూ స్ట్రాట్ కామ్ డిలీట్ చేసేసారు.


Next Story