కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంధన వాహనాల కారణంగా రోజురోజుకు కాలుష్యం పెరిగిపోతుండటంతో ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. 2035 నాటికల్లా పెట్రోల్, డీజిల్ వాహనాల అమ్మకాలు ముగించాలని బై డెన్ కార్ల తయారీ సంస్థలకు సూచించారు. ప్రస్తుతం ఎలక్ట్రికల్ వాహనాలు వస్తున్న నేపథ్యంలో వాటినే ప్రోత్సహించాలని, రాబోయే పది, పదిహేనేళ్లలో పెట్రోల్, డీజిల్ కార్ల అమ్మకాలు ముగించాలన్నారు. ప్రస్తుతం కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో నివేదిక ప్రకారం.. అమెరికాలో సెనేటర్లు 2035 వరకు దేశంలో ఇంధనంతో కూడిన వాహనాల అమ్మకాలు నిలిపివేయాలని కోరారు. ఈ నేపథ్యంలో ఈ విషయమై బైడెన్‌కు లేఖ రాశారు. దీంతో స్పందించిన బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇంధనంతో నడిచే వాహనాలను నిలిపివేసి ఎలక్ట్రికల్ వాహనాలను అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు.
ప్రస్తుతం కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో నివేదిక ప్రకారం.. అమెరికాలో సెనేటర్లు 2035 నాటికి దేశంలో ఇంధనంతో కూడిన వాహనాల అమ్మకాలు నిలిపివేయాలనే అంశాన్ని పరిశీలించిన తర్వాత బైడెన్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే 2035 నాటికి అమెరికాలో పెట్రోల్, డీజిల్‌లో నడిచే కార్ల పూర్తిగా కనుమరుగు కానున్నాయి.
ప్రపంచదేశాలన్ని ప్రస్తుతం పర్యావరణంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. పోల్యూషన్ పెరిగిపోతుండటంతో ప్రజలు అనారోగ్యం బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే కాలుష్య నివారణపై పలు సర్వేలు జరిపిన పరిశోధకులు ముందస్తుగా ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తున్నాయి.రానున్న పదేళ్లలో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ ఊహించని స్థాయికి చేరుకుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వల్ల ఎలాంటి ముప్పు ఉండదని పరిశోధకులు చెబుతున్నారు. దీంతో 2035 నాటి వరకు పెట్రోల్, డీజిల్ కార్లను నిషేధించడానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పూనుకున్నారుnew