గ్రీన్ కార్డ్ లాటరీ ప్రోగ్రామ్‌ను సస్పెండ్ చేసిన డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ కార్డు లాట‌రీ ప్రోగ్రామ్‌ను తాత్కాలికంగా ర‌ద్దు చేశారు. బ్రౌన్ యూనివ‌ర్సిటీలో కాల్పుల ఘ‌ట‌న‌కు...

By -  అంజి
Published on : 19 Dec 2025 5:34 PM IST

US President, Donald Trump, suspend, green card lottery program

గ్రీన్ కార్డ్ లాటరీ ప్రోగ్రామ్‌ను సస్పెండ్ చేసిన డొనాల్డ్ ట్రంప్ 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ కార్డు లాట‌రీ ప్రోగ్రామ్‌ను తాత్కాలికంగా ర‌ద్దు చేశారు. బ్రౌన్ యూనివ‌ర్సిటీలో కాల్పుల ఘ‌ట‌న‌కు పాల్ప‌డిన వ్య‌క్తి ఆ లాట‌రీ ప‌ద్ధ‌తిలోనే అమెరికాలోకి వచ్చినట్లు తెలిసింది. ఈ నేప‌థ్యంలో ఆ ప‌ద్ధ‌తిని స‌స్పెండ్ చేస్తూ ట్రంప్ ఆదేశాలు ఇచ్చారు. వివిధ దేశాల‌కు చెందిన సుమారు 50 వేల మందికి లాట‌రీ ప‌ద్ధ‌తిలో గ్రీన్ కార్డు జారీ చేస్తుంటారు. ట్రంప్ ఆదేశాల ప్ర‌కారం గ్రీన్ కార్డు లాట‌రీ వ్య‌వ‌స్థ‌ను తాత్కాలికంగా ర‌ద్దు చేయాల‌ని అమెరికా పౌర‌స‌త్వ‌, ఇమ్మిగ్రేష‌న్ స‌ర్వీసు శాఖ‌కు లేఖ పంపిన‌ట్లు హోంశాఖ మంత్రి తెలిపారు.

పోర్చుగీసు జాతీయుడైన క్లాడియో నీవ‌స్ వాలెంటిన్ బ్రౌన్ వ‌ర్సిటీలో కాల్పుల‌కు పాల్ప‌డ్డాడు. ఆ కాల్పుల్లో ఇద్ద‌రు విద్యార్థులు మ‌ర‌ణించ‌గా, 9 మంది గాయ‌ప‌డ్డారు. ఎంఐటీ ప్రొఫెస‌ర్ చనిపోయాడు. 2017లో నీవ‌స్‌కు ప‌ర్మినెంట్ రెసిడెన్సీ వ‌చ్చింది. నీవ‌స్ వాలెంటిన్ 2000లో బ్రౌన్ విశ్వవిద్యాలయంలో భౌతికశాస్త్రం అధ్యయనం చేయడానికి విద్యార్థి వీసాపై మొదటిసారిగా యునైటెడ్ స్టేట్స్‌లోకి ప్రవేశించాడు. 2001- 2017 మధ్య అతను ఎక్కడ నివసించాడో లేదా ఎక్కడ పనిచేశాడో అస్పష్టంగానే ఉందని పరిశోధకులు తెలిపారు, ఆ సమయంలో అతను వైవిధ్య వలసదారు వీసా పొందాడు. అదే సంవత్సరంలో అతనికి చట్టబద్ధమైన శాశ్వత నివాసి హోదా లభించింది.

Next Story