రష్యా శాటిలైట్‌ను పేల్చడంపై అమెరికా ఆగ్ర‌హం.. అన్ని దేశాల‌కు ప్ర‌మాదం ఉందంటూ

US outraged at Russian anti-satellite missile test debris. రష్యా తాజాగా యాంటీ శాటిలైట్‌ మిస్సైల్‌ను పరీక్షించడంపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

By అంజి  Published on  16 Nov 2021 5:11 AM GMT
రష్యా శాటిలైట్‌ను పేల్చడంపై అమెరికా ఆగ్ర‌హం.. అన్ని దేశాల‌కు ప్ర‌మాదం ఉందంటూ

రష్యా తాజాగా యాంటీ శాటిలైట్‌ మిస్సైల్‌ను పరీక్షించడంపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రష్యా బాధ్యతారహితందా, ప్రమాదకరమైన రీతిలో వ్యవహరించిందని అమెరికా పేర్కొంది. ఈ పరీక్ష ద్వారా రష్యా తన స్వంత శాటిలైట్‌లలో ఒకదానిని పేల్చివేసింది. అయితే ఇది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లోని సిబ్బందిని ప్రమాదంలో పడేసిందని, సిబ్బందిని క్యాప్సూల్స్‌లో ఆశ్రయించవలసి వచ్చిందని అమెరికా తెలిపింది. స్పేస్‌ స్టేషన్‌లో ప్రస్తుతం ఏడుగురు సిబ్బంది ఉన్నారు. వీరిలో నలుగురు అమెరికన్లు, ఒక జర్మన్, ఇద్దరు రష్యన్లు.

అంతరిక్ష కేంద్రం భూమికి దాదాపు 420కిమీ (260 మైళ్ళు) ఎత్తులో కక్ష్యలో ఉంది." రష్యన్ ఫెడరేషన్ తన స్వంత శాటిలైట్‌లలో ఒకదానిని యాంటీ శాటిలైట్ క్షిపణి యొక్క ధ్వంసం చేసిందని, విధ్వంసకరంగా యాంటీ శాటిలైట్‌ పరీక్షను నిర్లక్ష్యంగా నిర్వహించిందని యూఎస్‌ స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి నెడ్ ప్రైస్ బ్రీఫింగ్‌లో తెలిపారు. దీంతో అంతరిక్షంలో శ‌క‌లాల సంఖ్య పెరిగిపోతోంద‌ని, దాని వ‌ల్ల ఆస్ట్రోనాట్లు, కాస్మోనాట్ల‌కు తీవ్ర‌మైన ప్ర‌మాదం ఏర్ప‌డనున్న‌ట్లు అమెరికా ఆరోపించింది. రష్యా చేపట్టిన పరీక్ష వల్ల అంతరిక్షంలో సుమారు 1500 శకలాలు ఉత్పన్నమయ్యాయి.

వేల సంఖ్యలో చిన్న చిన్న పరిమాణంలో శిథిలాలు ఉన్నాయని అమెరికా తెలిపింది. ఈ ఘటనపై నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా వ్యవహరించిన తీరు అవివేకంగా ఉందన్నారు. దీని వల్ల అన్ని దేశాలకు ప్రమాదం పొంచి ఉందని పేర్కొన్నారు. రష్యా చేసిన పని వల్ల అంతర్జాతీయ అంతరిక్ష సంస్థకు ముప్పు ఉందని, చైనా స్పేస్‌ స్టేషన్‌కు చెందిన టైకోనాట్లకు కూడా విపత్కర పరిస్థితులు ఎదురయ్యాయని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ఆరోపిస్తోంది. అయితే ఈ ఘటన పట్ల రష్యా స్పేస్‌ ఏజెన్సీ స్పందించలేదు.

Next Story