స‌ముద్రంలో కూలిన మిలిట‌రీ హెలికాప్ట‌ర్‌

US military helicopter crashes into sea near San Diego.అమెరికాకు చెందిన మిల‌ట‌రీ హెలికాఫ్ట‌ర్ ఒక‌టి మంగ‌ళ‌వారం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Sep 2021 7:20 AM GMT
స‌ముద్రంలో కూలిన మిలిట‌రీ హెలికాప్ట‌ర్‌

అమెరికాకు చెందిన మిల‌ట‌రీ హెలికాఫ్ట‌ర్ ఒక‌టి మంగ‌ళ‌వారం సాయంత్రం 4.30గంట‌ల స‌మ‌యంలో స‌ముద్రంలో కుప్ప‌కూలింద‌ని యూఎస్ నేవీ వెల్ల‌డించింది. అధికారులు వెంట‌నే సెర్చ్ ఆప‌రేష‌న్‌ను మొద‌లుపెట్టారు. గ‌ల్లంతైన సిబ్బంది కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఎప్ప‌టిలాగే ఫ్లైట్ ఆప‌రేష‌న్స్ కోసం యూఎస్ఎస్ అబ్రహం లింకన్ నుంచి ఎమ్‌హెచ్‌-60ఎస్ హెలికాఫ్ట‌ర్ బ‌య‌లుదేరింది.సాయంత్రం 4.30గంట‌ల స‌మ‌యంలో శాన్ డియాగో తీరానికి 110 కి.మీ దూరంలో సముద్రంలో కూలిపోయింది. స‌మాచారం అందుకున్న వెంట‌నే అధికారులు సెర్చ్ ఆప‌రేష‌న్‌ను చేప‌ట్టారు.

అయితే.. ఆ స‌మ‌యంలో ఆ హెలికాఫ్ట‌ర్‌లో ఎంత మంది ఉన్నారు అనే స‌మాచారాన్ని వెల్ల‌డించలేదు. అయితే.. సాధార‌ణంగా ఆ హెలికాప్ట‌ర్‌లో న‌లుగురు సిబ్బందితో ప్ర‌యాణించ‌వ‌చ్చు. కాగా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక‌రిని ర‌క్షించిన‌ట్లు యూఎస్ నేవి ట్వీట్ చేసింది. మిగిలిన వారి కోసం గాలింపు కొన‌సాగుతుంద‌ని వెల్ల‌డించింది.

Next Story