ఇజ్రాయెల్ లో అడుగుపెట్టిన జో బైడెన్‌

అమెరికా అధ్యక్షులు జో బైడెన్ ఇజ్రాయెల్ లో అడుగుపెట్టారు. హమాస్‌ మిలిటెంట్లతో యుద్ధం చేస్తున్న

By Medi Samrat  Published on  18 Oct 2023 3:39 PM IST
ఇజ్రాయెల్ లో అడుగుపెట్టిన జో బైడెన్‌

అమెరికా అధ్యక్షులు జో బైడెన్ ఇజ్రాయెల్ లో అడుగుపెట్టారు. హమాస్‌ మిలిటెంట్లతో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌ కు మద్దతు ఇస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లో టెల్‌ అవీవ్‌లోని బెన్‌ గురియన్‌ విమానాశ్రయంలో దిగారు. అక్కడ బైడెన్‌కు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహు స్వాగతం పలికారు. గాజా నగరంలోని అల్-అహ్లీ అరబ్ హాస్పిటల్‌పై విధ్వంసకర ఇజ్రాయెల్ వైమానిక దాడి ఫలితంగా కనీసం 500 మంది ప్రాణాలు కోల్పోయిన సమయంలోనే యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు జో బిడెన్ ఇజ్రాయెల్‌కు చేరుకున్నారు. మధ్యప్రాచ్యంలో అమెరికాకు అత్యంత సన్నిహిత మిత్రదేశమైన ఇజ్రాయెల్‌కు బిడెన్ అండగా ఉంటామని అన్నారు.

బైడెన్‌ ఊయించని విధంగా జోర్డాన్‌ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఇజ్రాయెల్‌ పర్యటన తర్వాత బైడెన్‌ జోర్డాన్‌ వెళ్లాల్సి ఉంది. అక్కడ అరబ్‌ నేతలతో సమావేశం నిర్వహించేలా ముందుగా ప్రణాళిక చేసుకున్నారు. జోర్డాన్‌ రాజు అబ్దుల్లా 2, ఈజిప్టు ప్రధాని ఎల్‌-సిసీ, పాలస్తీనా అధ్యక్షుడు మహ్‌ముద్‌ అబ్బాస్‌ తదితరులతో భేటీ కావాల్సి ఉంది. గాజా ఆసుపత్రిపై దాడి ఘటనతో బైడెన్‌ జోర్డాన్‌ పర్యటన రద్దైంది.

Next Story