నేడు ఐక్యరాజ్యసమితి దినోత్సవం..!
United nations day 24 OCT. ఇవాళ ఐక్యరాజ్యసమితి దినోత్సవం. 1945 అక్టోబర్ 24న ఐక్యరాజ్యసమితి అమలులోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రతి సంవత్సరం
By అంజి Published on 24 Oct 2021 4:25 AM GMTఇవాళ ఐక్యరాజ్యసమితి దినోత్సవం. 1945 అక్టోబర్ 24న ఐక్యరాజ్యసమితి అమలులోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రతి సంవత్సరం అక్టోబర్ 24 ఐక్యరాజ్యసమితి దినోత్సవంగా జరుపుతారు. దీని ప్రాముఖ్యతను, ఎందుకు ఏర్పాటైంది, వివిధ విషయాలను భవిష్యత్తు తరాలకు తెలిపేందుకు ఐక్యరాజ్యసమితి దినోత్సవాన్ని ప్రపంచ దేశాలు ఘనంగా నిర్వహిస్తాయి. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలోని జనరల్ అసెంబ్లీ హాల్‌లో ప్రపంచ దేశాలు కలిసి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాయి. అయితే ఈ సంవత్సరం అన్ని దేశాలు ముందుగా రికార్డు చేసిన ప్రదర్శనలతో యూఎన్ డే వేడుకను నిర్వహించాయి.
బిల్డింగ్ బ్యాక్ టు గెదర్ ఫర్ పీస్ అండ్ ప్రోస్పెరిటీ అనే థీమ్‌తో రిపబ్లిక్ ఆఫ్ కొరియా అక్టోబర్ 21న ఈ దినోత్సవాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ మాట్లాడారు. 76 సంవత్సరాల క్రితం ఎన్నో విపత్కర సంఘటనల నుండి ప్రపంచాన్ని బయటపడేసెందుకు యూఎన్ ఒక గొప్ప ఆశదృక్పథంగా నెలకొల్పబడిందన్నారు.
యునైటెడ్ నేషన్స్ (ఐక్యరాజ్యసమితి) అనే పేరును అమెరికా మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్‌వెల్ట్ ఉపయోగించారు. ఐక్యరాజ్యసమితిలో ఆరు కీలక విభాగాలు ఉన్నాయి. జనరల్ అసెంబ్లీ, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, సెక్యూరిటీ కౌన్సిల్, సెక్రటేరియట్, ట్రస్టీషిప్ కౌన్సిల్, ఇంటర్నేషనల్ కోర్టులు ఉన్నాయి. యూఎన్ ఏర్పడినప్పుడు 51 దేశాలు మాత్రమే సభ్యత్వాన్ని కలిగి ఉండగా.. ప్రస్తుతం 193 దేశాలు యూఎన్‌లో సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. యూఎన్ ప్రధాన లక్ష్యం.. అంతర్జాతీయ శాంతి, భద్రతలు, అన్ని దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను పెంపొందించడం.