విమానం‌లో మంట‌లు.. గాలిలో ఉండ‌గానే విడిపోయిన ఇంజిన్‌.. 231 మంది ప్ర‌యాణీకులు

United Airlines flight catches fire midair after engine failure.ఓ విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే ఇంజిన్‌లో మంట‌లు చెల‌రేగాయి.

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 21 Feb 2021 11:40 AM IST

United Airlines flight catches fire midair after engine failure

ఓ విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే ఇంజిన్‌లో మంట‌లు చెల‌రేగాయి. గ‌మ‌నించిన ప్ర‌యాణీకులు అరుపులు కేక‌ల‌తో ఆ విమానం దద్ద‌రిల్లుతోంది. ఇక త‌మ ప‌ని అంతే అని.. ఇదే చివ‌రి ప్ర‌యాణం అని వారు భావించారు. అప్ర‌మ‌త్త‌మైన పైలెట్లు అత్య‌వ‌స‌రంగా ల్యాండింగ్ చేసేందుకు తిరిగి ఎయిర్‌పోర్టుకు బ‌య‌లు దేరారు. మ‌ధ్య‌లో విమానం ఇంజిన్ ముక్క‌లు ముక్క‌లుగా ఊడి కింద ప‌డ‌టం మొద‌లైంది. విమాన ఇంజిన్ శిథిలాలు ఒక చోట ఇంటికి అతి స‌మీపంలో ప‌డితే.. మ‌రో చోట న‌డిరోడ్డుపై ప‌డ్డాయి. అయితే.. ఫైలెట్లు చాక‌చ‌క్యంగా విమానాశ్ర‌యంలో ల్యాండింగ్ చేశారు. ఈ ఘ‌ట‌న‌లో ఎవ‌రికి ఎమీ కాక‌పోవ‌డంతో అంద‌రూ ఊపిరిపీల్చుకున్నారు.

శనివారం డెన్వర్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బోయింగ్‌ 777-200 విమానం హోనొలులు బయలుదేరింది. ఈ క్రమంలో టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో ప్రయాణికులంతా ఆందోళనకు గురయ్యారు. వెంట‌నే ఫైలెట్లు అప్ర‌మ‌త్తం అయి తిరిగి డెన్వ‌ర్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌మంలో విమానాన్ని అత్య‌వ‌స‌రంగా ల్యాండింగ్ చేశారు. ఈ ఘ‌ట‌న‌లో ఎవ‌రికి ఎటువంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌లేదు. ఆ స‌మ‌యంలో ఆ విమానంలో 231 మంది ప్ర‌యాణీకుల‌తో పాటు ప‌ది మంది సిబ్బంది ఉన్నారు.


ఆకాశంలో ఉండ‌గానే విమానం నుంచి ఇంజిన్ విడివ‌డిపోయింది. ఆ శ‌క‌లాలు ఓ ఇంటి బయట చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ చిత్రాలను కొలరాడోలోని బ్రూమ్‌ఫీల్డ్‌ పోలీసులు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. విమాన ప్రయాణికులు కాని, శిథిలాలు పడిన ప్రదేశాల్లో కానీ ఒక్కరు కూడా గాయపడలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు నేషనల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ స్టేఫీ బోర్డ్‌ (ఎన్‌టీఎస్‌బీ) తెలిపింది. అలాగే విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.



Next Story