పేరు మార్చుకున్న‌ట‌ర్కీ.. ఐరాస ఆమోదం.. ఇక‌పై ఏమ‌ని పిల‌వాలంటే

UN agrees to change Turkey’s official name to ‘Türkiye’.త‌మ దేశం పేరు మార్చాల‌ని ఐక్య‌రాజ్య‌స‌మితి(ఐరాస‌) ని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Jun 2022 1:07 PM IST
పేరు మార్చుకున్న‌ట‌ర్కీ.. ఐరాస ఆమోదం.. ఇక‌పై ఏమ‌ని పిల‌వాలంటే

త‌మ దేశం పేరు మార్చాల‌ని ఐక్య‌రాజ్య‌స‌మితి(ఐరాస‌) ని ట‌ర్కీ కోరింది. ఇందుకు ఐరాస కూడా అంగీకారం తెలిపింది. త‌క్ష‌ణ‌మే పేరు మార్పు అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని యూఎన్ చీఫ్ వెల్ల‌డించారు. ఇక నుంచి ట‌ర్కీని తుర్కియా (Türkiye)గా పిల‌వాల్సి ఉంటుంది.

టర్కీ గుర్తింపులో మార్పులుచేసే "రీబ్రాండింగ్" కార్యక్రమాన్ని గతేడాది ఆ దేశ అధ్యక్షుడు రెచప్ తయ్యప్ ఎర్దోవాన్ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ప్రముఖ అంతర్జాతీయ సంస్థలను ఆయన ఆశ్రయించారు. 'తుర్కియా' అనే పదం దేశానికి చక్కగా సరిపోతుందన్నారు. ఎందుకంటే.. తుర్కుల సంస్కృతి, సంప్రదాయాలు, నాగరికత, విలువలకు అద్దం పడుతుందని ఎర్జోవాన్ చెబుతూ వస్తున్నారు. టర్కీ అనే పదాలకు ఎవో అర్థాలు ఉన, ఓ పక్షి పేరు కూడా టర్కీ అని ఉండడం, అనేక అర్థాలు ఇంగ్లీషులో ఉన్నాయని అందుకే పేరు మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

పేరు మార్చడం వల్ల దేశ బ్రాండ్ మరింత పెరుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు టర్కీగా ఉన్న దేశం పేరును తుర్కియా (Türkiye)గా మార్చుకున్నట్లు.. ఐక్యరాజ్య సమితికి పంపిన లేఖలో పేర్కొన్నారు. కొత్త పేరును అధికారికంగా గుర్తించాలని టర్కీ విదేశాంగ మంత్రి ఐక్యరాజ్య సమితిని కోరారు. ఇందుకు ఐరాస కూడా అంగీకారం తెలిపింది. ఇక పై ఈ దేశం నుంచి ఎగుమతులయ్యే ప్రొడక్టులపై మేడ్ ఇన్ తుర్కియా అని ఉంటుంది.

ఇక‌.. పేరు మార్చడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు త‌మ దైన శైలిలో స్పందిస్తున్నారు. వచ్చే సంవత్సరం ఎన్నికలు జరగాల్సి ఉండడంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి చ‌ర్య చేప‌ట్టారని కొంద‌రు కామెంట్లు పెడుతున్నారు. కాగా.. దేశాలు ఇలా పేర్లు మార్చుకోవడం కొత్తేమీ కాదు. గతంలో కూడా పలు దేశాలు పేర్లను మార్చుకున్నాయి.

Next Story