రష్యా సైన్యం ఉక్రెయిన్ రాజధాని నగరమైన కైవ్‌ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. రష్యా దళాలను ఎదుర్కోవడానికి సామాన్యులు భద్రతా దళాలలో చేరుతున్నారు. ఉక్రెయిన్ అందగత్తె, మాజీ మిస్ గ్రాండ్ ఉక్రెయిన్ అనస్తాసియా లెన్నా రష్యా దాడికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఉక్రేనియన్ మిలిటరీలో చేరింది. తన సోషల్ మీడియా ఖాతాలో లెన్నా తన ఇంటిని రక్షించుకోవడానికి కాపాలగా ఉన్నట్లు పోస్టు పెట్టారు. "దండయాత్ర చేయాలనే ఉద్దేశ్యంతో ఉక్రేనియన్ సరిహద్దును దాటిన ప్రతి ఒక్కరూ చంపబడతారు!" అంటూ ఓ రైఫల్‌ను పట్టుకుని ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో లెన్నా పోస్ట్ చేశారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సైన్యం నడుస్తున్న ఫొటోలను కూడా లెన్నా పోస్ట్ చేశారు. చాలా మంది ఆ ఫొటోను షేర్ చేశారు. అందాల బ్యూటీ అనస్తాసియా లెన్నా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఉక్రెయిన్ సాయుధ దళాలకు మద్ధతుగా, రష్యా దాడులను ఖండిస్తూ తన సోషల్ మీడియా ఖాతాలో లెన్నా అనేక పోస్టులు పెట్టారు. ఐదు భాషల్లో మాట్లాడగల లెన్నా.. ట్రాన్స్‌లేటర్‌గా కూడా పని చేశారు. ఇదిలా ఉంటే ఉక్రెయిన్‌పై రష్యా దళాలు విరుచుకుపడుతుండటంతో, వారిని ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్ సైన్యాలు తమ శక్తి మేర ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు చాలా మంది సామాన్య పౌరులు సైన్యంలో చేరుతున్నారు.