ఉక్రేనియన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ ఒక బంకర్‌కి తరలించబడ్డారని రాజధాని నగరంలో ఉన్న ఒక రిపోర్టర్ తెలిపారు. రష్యా దళాలు కీవ్ నగరానికి దగ్గరగా చేరుకోవడంతో ఉక్రేనియన్ సైనిక దళాలు తమ అధ్యక్షుడిని కాపాడుకునేందుకు బంకర్‌లోకి తరలించారు. "అతను ఒక బంకర్‌లో ఉన్నాడు. ప్రస్తుతం అతను ఒక రహస్య ప్రదేశంలో ఉన్నాడు. అయినప్పటికీ అతను ఇప్పటికీ కీవ్ నగర మధ్య భాగంలో ఉన్నాడని" అని రిపోర్ట్ చెప్పాడు. తమ దేశంపై రష్యా దాడిని ప్రపంచ దేశాలు ప్రేక్షకుల్లా చూస్తున్నాయని జెలెన్‌స్క్సీ అసంతృప్తి వ్యక్తం చేశారు.
గురువారం సాయంత్రం తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోలో.. రష్యా దండయాత్రలో దాడి ప్రారంభమైనప్పటి నుండి 137 మంది ఉక్రేనియన్ సైనికులు మరణించారని, 316 మంది గాయపడ్డారని జెలెన్స్కీ చెప్పారు. రష్యా విధ్వంసక బృందాలు కీవ్ నగరంలోకి ప్రవేశించాయని తాను నమ్ముతున్నట్లు జెలెన్స్కీ చెప్పారు. సమాచారం ప్రకారం.. శత్రువులు తనను మొదటి టార్గెట్‌గా గుర్తించారు. నా కుటుంబాన్ని టార్గెట్ నంబర్ 2గా గుర్తించారు. దేశాధినేతను నాశనం చేయడం ద్వారా ఉక్రెయిన్‌ను రాజకీయంగా నాశనం చేయాలని వారు భావిస్తున్నారు. శత్రు విధ్వంసక బృందాలు కీవ్‌లోకి ప్రవేశించినట్లు మాకు సమాచారం ఉంది"అని జెలెన్స్కీ చెప్పాడు. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ప్రెస్ సెక్రటరీ మాట్లాడుతూ.. యునైటెడ్ స్టేట్స్ జెలెన్స్కీతో టచ్‌లో ఉందని, అయితే దాడి మధ్య అతని భద్రతపై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు.