బ్రేకింగ్.. కాబూల్‌లో ఉక్రెయిన్ విమానం హైజాక్
Ukraine's Evacuation Plane 'Hijacked' In Kabul By Unidentified People.అఫ్గానిస్థాన్ ను తాలిబన్లు హస్త చేసుకున్న సంగతి
By తోట వంశీ కుమార్ Published on 24 Aug 2021 8:37 AM GMTఅఫ్గానిస్థాన్ ను తాలిబన్లు హస్త చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆ దేశంలో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆ దేశం విడిచి వెళ్లేందుకు విమానాశ్రయానికి భారీగా చేరుకుంటున్నారు. ఇక అఫ్గానిస్థాన్‌లో చిక్కుకున్న తమ దేశస్థులకు తీసుకువచ్చేందుకు ఆయా దేశాలు విమానాలను అక్కడకు పంపిస్తున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్ విమానం ఒకటి హైజాక్‌కు గురైంది. ఉక్రెయిన్ దేశస్థులకు తీసుకువెళ్లేందుకు వచ్చిన ఉక్రెయిన్ విమానాన్ని కాబుల్ ఎయిర్‌పోర్టులో కొందరు గుర్తుతెలియని దుండగులు ఆయుధాలతో వచ్చి హైజాక్ చేసి ఇరాన్ తీసుకువెళ్లినట్లు ఉక్రెయిన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి యెవ్‌జెనీ యెనిస్ చెప్పారు.
రష్యా న్యూస్ ఏజెన్సీ కథనం ప్రకారం.. గత ఆదివారం మా దేశానికి చెందిన విమానాన్ని కొంత మంది హైజాక్ చేశారు. మంగళవారం ఆవిమానాన్ని మా నుంచి దొంగిలించి ఇరాన్ తీసుకువెళ్లారని యెనిస్ చెప్పినట్లు వెల్లడించింది. ఇక ఆ విమానంలో ఉన్న ప్రయాణీకులు ఉక్రెయిన్ దేశానికి చెందిన వారు కాదని.. వేరే దేశ ప్రయాణీకులు తీసుకుని వెళ్లిపోయారన్నారు. దీని వల్ల అఫ్గాన్ నుంచి తమ దేశానికి చెందిన పౌరులను తరలించే ప్రక్రియకు ఆటంకం ఏర్పడినట్లు చెప్పారు. కాగా.. అసలు ఆ విమానాన్ని ఎందుకు హైజాక్ చేశారనే దానిపై ఉక్రెయిన్ విదేశాంగ శాఖ ఆరా తీస్తోంది. ఇప్పటి వరకు హైజాక్ చేసిన వారి నుంచి ఎలాంటి సమాచారం అందలేదని చెబుతోంది.