సహకరించలేదని.. మేయర్‌ను కిడ్నాప్‌ చేసిన రష్యా సేనలు

Ukraine accuses Russia of abducting Melitopol mayor, flouting international law. సహకరించలేదని.. మేయర్‌ను కిడ్నాప్‌ చేసిన రష్యా సేనలు

By అంజి
Published on : 12 March 2022 2:11 PM IST

సహకరించలేదని.. మేయర్‌ను కిడ్నాప్‌ చేసిన రష్యా సేనలు

ఉక్రెయిన్‌ దేశంపై రష్యా బలగాలు దాడులు కొనసాగిస్తున్నాయి. తాజాగా మెలిటోపోల్‌ నగరాన్ని రష్యా దళాలు తమ వశం చేసుకున్నాయి. కాగా ఆ నగర మేయర్‌ ఇవాన్‌ ఫెడొరోవ్‌ను రష్యా దళాలు కిడ్నాప్‌ చేసినట్లు ఉక్రెయిన్‌ ఆరోపించింది. మెలిటోపోల్ నగర మేయర్ ఇవాన్ ఫెడోరోవ్ రష్యా సైన్యానికి సహకరించడానికి నిరాకరించినందున కిడ్నాప్ చేశారని ఉక్రెయిన్ అధికారులు ఆరోపించారు. మేయర్‌ను అపహరించడం ద్వారా రష్యా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించిందని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ ఆరోపించింది. మేయర్‌ను విడుదల చేయాలంటూ వేలాది మంది నిర్వాసితులు పరిపాలనా భవనానికి చేరుకున్నారు.


మెలిటోపోల్ మేయర్ ఇవాన్ ఫెడోరోవ్‌ను కిడ్నాప్ చేశారని ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రి సలహాదారు అంటోన్ గెరాష్చెంకో ఆరోపించారు. అతని ప్రకారం.. ఇవాన్ ఫెడోరోవ్ నగరాన్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్న రష్యన్ మిలిటరీకి సహకరించడానికి నిరాకరించాడు. అతను సిటీ క్రైసిస్ సెంటర్‌లో నిర్బంధించబడ్డాడు. అక్కడ అతను నగరం యొక్క లైఫ్ సపోర్ట్‌కి బాధ్యత వహించాడని పేర్కొన్నాడు. కాగా ఈ ఘటనపై రష్యా ఇంకా స్పందించలేదు. ఉక్రెయిన్‌పై తీవ్రవాద ఆరోపణలు చేసి రష్యా బలగాలు అతన్ని కిడ్నాప్ చేశాయని పేర్కొంది.

Next Story