టిప్పు సుల్తాన్ సింహాసనంలోని పులి తలను వేలానికి పెట్టిన బ్రిటన్.!

UK auctioning tipu sultans throne. భారతదేశం నుండి దొంగిలించబడిన టిప్పు సుల్తాన్‌ సింహాసనంలోని ముందరి భాగాన్ని యునైటెడ్‌ కింగ్‌డమ్‌ వేలానికి పెట్టింది.

By అంజి  Published on  17 Nov 2021 9:29 AM IST
టిప్పు సుల్తాన్ సింహాసనంలోని పులి తలను వేలానికి పెట్టిన బ్రిటన్.!

భారతదేశం నుండి దొంగిలించబడిన టిప్పు సుల్తాన్‌ సింహాసనంలోని ముందరి భాగాన్ని యునైటెడ్‌ కింగ్‌డమ్‌ వేలానికి పెట్టింది. 1.5 మిలియన్లకు (మన దేశ కరెన్సీలో రూ.14,98,64,994)కి యూకే డిజటల్‌, సంస్కృతి, మీడియా, క్రీడల విభాగం వేలం పెట్టింది. వేలానికి పెట్టిన సింహాసనం ముందుభాగం 18వ శతాబ్దంలో మైసూరు చక్రవర్తి టిప్పు సుల్తాన్‌ది. ఈ సింహాసనానికి చెందిన బంగారు పులి తలని వేలానికి పెట్టడంపై దేశ వ్యాప్తంగా సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. బ్రిటన్‌ ప్రభుత్వం దొంగిలించినదానిని ఇలా అంగట్లో అమ్మడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. టిప్పు సుల్తాన్‌ సింహాసనాన్ని 'టైగర్‌ ఆఫ్‌ మైసూరు' అని పిలుస్తుంటారు.

సింహాసనంలో 8 బంగారు పులి తలలు ఉండగా.. వాటిలో ఒక దానిని బ్రిటన్‌ ప్రభుత్వం ఇప్పుడు వేలానికి పెట్టింది. టిప్పు సుల్తాన్‌ సింహాసనం గురించి 2009 వరకు కూడా ప్రపంచానికి తెలికపోవడం గమనార్హం. కాగా వేలానికి పెట్టిన టిప్పు సుల్తాన్‌ సింహాసనానికి భారీగా రెస్పాన్స్‌ వస్తోందని యూకే ఆర్ట్స్‌ మినిస్టర్‌ లార్డ్‌ స్టీఫెన్‌ పార్కిన్సన్‌ తెలిపారు. భారతదేశంలో బ్రిటీష్‌ పాలన గురించి ఈ తరానికి తెలియజేయడమే ఉద్దేశ్యంగా పులి తలను వేలానికి పెట్టామని తెలిపారు. టిప్పు సుల్తాన్‌ సింహాసనం పూర్తిగా బంగారంతో తయారు చేయబడింది. ఇంకా ఇందులో కెంపులు, పచ్చలు, వజ్రాలను అమర్చారు అప్పటి దక్షిణ భారత స్వర్ణకారులు. బ్రిటిష్‌ ఈస్ట్‌ ఇండియాకు టిప్పు సుల్తాన్‌ వణుకు పుట్టించేలా చేశాడు.


Next Story