మయన్మార్, బ్యాంకాక్‌లో 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 12 గంటలకు ఒక్కసారిగా ప్రకపంనలు రావడంతో భారీ భవనాలు పేక మేడల్లా కుప్పకూలాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనతో ఇళ్లు, ఆఫీసుల నుంచి బయటికి పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే సునామీ హెచ్చరిక లేదని అధికారులు తెలిపారు. కూలిన భవనాల వద్ద సహాయక చర్యలు చేపట్టారు.
శుక్రవారం మయన్మార్‌లో 7.7 , 6.4 తీవ్రతతో వరుసగా రెండు భూకంపాలు సంభవించాయి. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో బలమైన ప్రకంపనలు సంభవించాయి. మయన్మార్‌లోని మండలేలోని ఐకానిక్ అవా వంతెన ఇరావడీ నదిలోకి కూలిపోయిందని, భారీ భూకంపాల కారణంగా అనేక భవనాలు కూలిపోయాయని సమాచారం, దీని కేంద్రం సాగింగ్ సమీపంలో ఉంది.
భూకంపాల ప్రభావం ఎంతగా ఉందంటే, 900 కి.మీ దూరంలో ఉన్న బ్యాంకాక్‌ను కూడా భూకంపం కుదిపేసింది. థాయ్ రాజధానిలోని అనేక ఎత్తైన భవనాలు నేలమట్టమయ్యాయని సోషల్ మీడియాలో వచ్చిన దృశ్యాలు చెబుతున్నాయి. ఈ ప్రకంపనల కారణంగా ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.