Video: విషాదం.. హాట్‌ ఎయిర్‌ బెలూన్‌లో మంటలు.. ఇద్దరు మృతి

మెక్సికో దేశంలో విషాద ఘటన చోటు చేసుకుంది. మెక్సికో నగరానికి సమీపంలో ఉన్న ప్రఖ్యాత టియోటిహుకాన్

By అంజి  Published on  2 April 2023 7:50 AM GMT
Mexico, fire accident, Teotihuacan archaeological site

Video: విషాదం.. హాట్‌ ఎయిర్‌ బెలూన్‌లో మంటలు.. ఇద్దరు మృతి

మెక్సికో దేశంలో విషాద ఘటన చోటు చేసుకుంది. మెక్సికో నగరానికి సమీపంలో ఉన్న ప్రఖ్యాత టియోటిహుకాన్ పురావస్తు ప్రదేశంలో ఎగురుతున్న హాట్-ఎయిర్ బెలూన్ మంటల్లో చిక్కుకోవడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారని మెక్సికో ప్రభుత్వం శనివారం తెలిపింది. టియోటిహుకాన్ పురావస్తు ప్రదేశానికి చాలా మంది పర్యాటకులు హాట్‌ ఎయిర్‌ బెలూన్‌లో విహారిస్తుంటారు. ఈ క్రమంలోనే శనివారం నాడు పలువురు పర్యాటకులు విహాంగ వీక్షణ కోసం హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ ఎక్కారు. అది కొంత దూరం వెళ్లిన తర్వాత.. బెలూన్‌లో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందులో ఉన్న వారు భయభ్రాంతులకు గురయ్యారు.

దీంతో అందులోని పర్యాటకులు ఇద్దరు కిందకు దూకి ప్రాణాలు కోల్పోయారు. బాధితులను 39 ఏళ్ల మహిళ, 50 ఏళ్ల వృద్ధుడిగా గుర్తించారు. మరికొందరికి తీవ్రగాయాలు అయ్యాయి. మైనర్ ముఖానికి సెకండ్ డిగ్రీ కాలిన గాయాలతో పాటు కుడి తొడ ఎముక ఫ్రాక్చర్ అయ్యింది. బెలూన్‌లో మంటలు చెలరేగిన వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే బెలూన్‌లో ఇతర ప్రయాణికులు ఎవరైనా ఉన్నారా అనేది మాత్రం చెప్పలేదు. ప్రఖ్యాత టియోటిహుకాన్ పురావస్తు ప్రదేశం. ఇది కొలంబియన్‌ పూర్వకాలం నాటి స్మారక చిహ్నం. ఇక్కడ 150 డాలర్లు చెల్లించి హాట్‌ ఎయిర్‌ బెలూన్‌లో విహాంగ వీక్షణ చేయొచ్చు.

Next Story