దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. దీంతో దాదాపు ఆస్పత్రుల్ని కరోనా రోగులతో నిండిపోతున్నాయి. దీంతో భారత్‌ను ఆదుకునేందుకు పలు దేశాలు, వివిధ అంతర్జాయ సంస్థలు ముందుకు వచ్చాయి. మెక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజాలు తమ వంతు సాయాన్ని ప్రకటించాయి. తాజాగా మైక్రో బ్లాగింగ్ దిగ్గజం ట్విట్టర్ భూరి విరాళాన్ని ప్రకటించింది. కరోనాపై పోరాటంలో తన వంతు సాయంగా 15 మిలియన్ డాలర్లు.. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.110కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
ఈ మేరకు ట్విట్టర్ సీఈవో జాక్ పాట్రిక్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఈ సాయాన్ని కేర్, ఎయిడ్ ఇండియా, సేవా ఇంటర్నేషనల్ యూఎస్‌ఏ అనే మూడు స్వచ్ఛంద సంస్థల ద్వారా అందజేయనున్నారు. కేర్ ద్వారా 10 మిలియన్ డాలర్లు, ఎయిడ్ ఇండియా, సేవా ఇంటర్నేషనల్ యూఎస్‌ఏలకు చెరో రెండున్నర మిలియన్ డాలర్లు సాయంగా అందజేస్తున్నట్టు తెలిపారు. ఈ మూడు సంస్థలు ఈ నిధులను భారత్ లో కరోనా మహమ్మారి కోసం ఖర్చు చేయనున్నాయి. ఆక్సిజన్, కరోనా కేర్ సెంటర్లు, వ్యాక్సిన్ తదితర వాటికి ఖర్చు చేయబోతున్నాయి.