ట‌ర్కీలోని బొగ్గు గ‌నిలో భారీ పేలుడు.. 25 మంది కార్మికుల దుర్మ‌ర‌ణం

Turkish mine explosion kills 25 and leaves dozens trapped.ట‌ర్కీ దేశంలో ఘోర ప్ర‌మాదం సంభ‌వించింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 Oct 2022 3:14 AM GMT
ట‌ర్కీలోని బొగ్గు గ‌నిలో భారీ పేలుడు.. 25 మంది కార్మికుల దుర్మ‌ర‌ణం

ట‌ర్కీ దేశంలో ఘోర ప్ర‌మాదం సంభ‌వించింది. ఓ బొగ్గు గ‌నిలో మీథేన్ పేలుడు సంభ‌వించి 25 మందికి పైగా కార్మికులు మ‌ర‌ణించారు. డ‌జ‌న్ల కొద్ది మంది భూగ‌ర్భ గ‌నిలోనే చిక్కుకున్నారు.

ఉత్త‌ర ట‌ర్కీలోని అమ‌స్రా వ‌ద్ద ఓ బొగ్గు గ‌నిలో శుక్ర‌వారం సూర్యాస్త‌మ‌యం కంటే కొద్ది సేప‌టి ముందు మీథేన్ పేలుడు జ‌రిగింది. కొంద‌రు కార్మికులు బ‌య‌ట‌కు రాగా.. చాలా మంది కార్మికులు భూ గ‌ర్భంలోనే చిక్కుకుని పోయారు. ప్ర‌మాద స‌మ‌యంలో 110 మందికిపైగా కార్మికులు ప‌ని చేస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు.

స‌మాచారం అందుకున్న వెంట‌నే అధికారులు, రెస్క్యూ టీమ్ ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వీరిలో కొంద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు 25 మంది మ‌ర‌ణించిన‌ట్లు తెలిపారు. ఇంకా సుమారు 50 మంది కార్మికులు గ‌నిలో చిక్కుకుని, వీరు భూమి పై నుంచి 300 నుంచి 350 మీట‌ర్ల మ‌ధ్య‌లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుకుని ఉంటార‌ని అంచ‌నా వేస్తున్నారు.

రాత్రి కావ‌డంతో స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు ఆటంకం ఏర్ప‌డింది. శ‌నివారం తెల్ల‌వారుజాము నుంచే మ‌ళ్లీ స‌హాయక చ‌ర్య‌లు మొద‌లెట్టారు. ట‌ర్కీలో ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన దుర్ఘ‌ట‌న‌ల్లో ఇది ఒక‌టి అని ఆదేశ ఆరోగ్య మంత్రి ఫహ్రెటిన్ కోకా తెలిపారు.

"మేము నిజంగా విచారకరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాము" అని అంతర్గత మంత్రి సులేమాన్ అన్నారు. " మా సోదరులలో మొత్తం 110 మంది (భూగర్భంలో) పనిచేస్తున్నారు. వారిలో కొందరు తమంతట తాముగా కొంద‌రు బ‌య‌టికి రాగా.. మ‌రికొంద‌రిని ర‌క్షించారు. దాదాపు 50 మంది మైనర్లు భూమికి దిగువన 300 మరియు 350 మీటర్ల (985 నుండి 1,150 అడుగులు) మధ్య రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుకున్నారని తెలిపారు.

టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ అన్నీ కార్య‌క్ర‌మాలు రద్దు చేసుకుని శనివారం ప్రమాద స్థలానికి చేరుకుంటానని చెప్పారు. ప్రాణనష్టం మరింత పెరగకూడదని, మా మైనర్లు సజీవంగా దొరుకుతారని మా ఆశ' అని ఎర్డోగన్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Next Story