ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కశ్యప్‌ పటేల్‌

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన పాలనా యంత్రాగంలో వ్యూహాత్మకంగా నియామకాలు చేస్తున్నారు.

By అంజి  Published on  1 Dec 2024 7:50 AM IST
Donald Trump , Kash Patel , FBI Director, USA

ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కశ్యప్‌ పటేల్‌

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన పాలనా యంత్రాగంలో వ్యూహాత్మకంగా నియామకాలు చేస్తున్నారు. తాజాగా భారత సంతతికి చెందిన కశ్యప్‌ పటేల్‌ (కాష్‌ పటేల్‌)కు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక బాధ్యతలు అప్పగించారు. అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కాష్ పటేల్‌ను ఎఫ్‌బిఐ డైరెక్టర్‌గా నామినేట్ చేశారు. ఆయనను ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ డైరెక్టర్‌గా నియమించనున్నట్టు ప్రకటించారు. కశ్యప్‌ అమెరికాలో అవినీతి నిర్మూలనకు శ్రమిస్తున్నారని ట్రంప్‌ పేర్కొన్నారు.

కశ్యప్‌ కుటుంబ మూలాలు గుజరాత్‌లో ఉన్నాయి. 1980లో న్యూయార్క్‌లో జన్మించిన ఆయన.. నేషనల్‌ సెక్యూరిటీ, కౌంటర్‌ టెర్రరిజం విభాగాల్లో పని చేశారు. "ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తదుపరి డైరెక్టర్‌గా కశ్యప్ 'కాష్' పటేల్ పనిచేస్తారని నేను గర్విస్తున్నాను" అని ట్రంప్ శనివారం రాత్రి ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. "కాష్ ఒక తెలివైన న్యాయవాది, పరిశోధకుడు, 'అమెరికా ఫస్ట్' పోరాట యోధుడు, అతను అవినీతిని బహిర్గతం చేయడం, న్యాయాన్ని రక్షించడం, అమెరికన్ ప్రజలను రక్షించడం కోసం తన వృత్తిని గడిపాడు" అని ట్రంప్‌ పేర్కొన్నారు. అటు కశ్యప్ తొలి నుంచి ట్రంప్ కు విధేయుడిగా ఉన్నారు.

Next Story