ఇరుక్కుపోయిన 500 మంది భారతీయులు.. మీకు తెలిసిన వాళ్ళు కూడా ఉండొచ్చు.!

మంచి మంచి జీతం అని చెబుతారు. ఓ రెండు మూడేళ్లు పని చేస్తే చాలు ఇక్కడ ఉన్న అప్పులన్నీ తీర్చేయొచ్చని అనుకుంటూ ఉంటారు.

By -  Medi Samrat
Published on : 30 Oct 2025 8:34 AM IST

ఇరుక్కుపోయిన 500 మంది భారతీయులు.. మీకు తెలిసిన వాళ్ళు కూడా ఉండొచ్చు.!

మంచి మంచి జీతం అని చెబుతారు. ఓ రెండు మూడేళ్లు పని చేస్తే చాలు ఇక్కడ ఉన్న అప్పులన్నీ తీర్చేయొచ్చని అనుకుంటూ ఉంటారు. కానీ అక్కడి వెళ్ళాక తెలుస్తుంది తాము మోసపోవడమే కాకుండా, భారతదేశంలో ఉన్న వాళ్ళను కూడా మోసం చేయడమే తమ పని అని. సైబర్ క్రైమ్స్ లో పాల్పడడానికి భారతీయులనే ఎరగా వాడుతున్నాయి చైనా మాఫియా గ్యాంగ్స్. అక్కడకు వెళ్లిన మోసపోయిన నిరుద్యోగులలో మనకు తెలిసిన వాళ్ళు కూడా ఉండొచ్చు.

చైనా మాఫియా నడిపే సైబర్ క్రైమ్ కేంద్రంలో తెలియకుండా పనిచేయడానికి వెళ్లిన మోసపోతున్న భారతీయులు ఎంతో మంది ఉన్నారు. దాదాపు 500 మంది భారతీయులను స్వదేశానికి రప్పించడానికి భారతదేశం థాయిలాండ్‌తో కలిసి పనిచేస్తోంది. మయన్మార్ నుండి దేశంలోకి ప్రవేశించిన తన పౌరులను తిరిగి తీసుకురావడానికి భారతదేశం ఒక విమానం పంపాలని యోచిస్తున్నట్లు థాయ్ ప్రధాని అనుతిన్ చార్న్‌విరాకుల్ తెలిపారు.

గత వారం సైనిక దళాలు మయన్మార్‌లోని చైనా మాఫియా నడిపే కెకె పార్క్ కాంపౌండ్‌పై దాడి చేసిన తర్వాత భారతీయులతో సహా దాదాపు 700 మంది పారిపోయారు. సరిహద్దు దాటిన తర్వాత భారతీయులని థాయ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. థాయిలాండ్‌లో నిర్బంధించబడిన భారతీయుల పరిస్థితి గురించి మంత్రిత్వ శాఖకు తెలుసునని, వారిని తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి అధికారులతో కలిసి పనిచేస్తున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు.

Next Story