ఘోర రైలు ప్రమాదం.. 36 మంది మృతి

Train crashes in eastern Taiwan,injuring dozens. తూర్పు తైవాన్‌లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. 350 మంది ప్ర‌యాణికుల‌తో

By Medi Samrat  Published on  2 April 2021 6:11 AM GMT
train crashes

తూర్పు తైవాన్‌లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. 350 మంది ప్ర‌యాణికుల‌తో తైటంగ్‌కు ప్రయాణిస్తున్న రైలు.. హువాలియన్‌కు ఉత్తరాన ఉన్న ఒక సొరంగంలో శుక్రవారం ఉదయం పట్టాలు తప్పింది. ఈ ప్రమాదకర ఘటనలో 36 మంది మృతిచెంద‌గా.. 75 మంది తీవ్ర గాయాలపాలైనట్టు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశమున్నట్టు తెలుస్తోంది. సరిగ్గా పార్క్ చేయని ట్రక్ ఒకటి.. రైలు పట్టాల పైకి జారిపోవడంతో ఈ ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. రైలు సగభాగం సొరంగం లోపలికి వెళ్లాక పట్టాలు తప్పడంతో సహాయక బృందాలు లోపలికి వెళ్లేందుకు ఇబ్బందులు ప‌డుతున్నారు. సొరంగంలో దాదాపు 70 మంది వ‌ర‌కూ చిక్కుకుపోయి ఉంటారని అధికారులు చెబుతున్నారు.
Next Story