Anti Tobacco day: మాకు ఆహారం కావాలి.. పొగాకు కాదు
నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతీ సంవత్సరం మే 31వ తేదీన యాంటీ టొబాకో డేను నిర్వహిస్తోంది.
By అంజి Published on 31 May 2023 8:00 AM ISTAnti Tobacco day: మాకు ఆహారం కావాలి.. పొగాకు కాదు
నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతీ సంవత్సరం మే 31వ తేదీన యాంటీ టొబాకో డేను నిర్వహిస్తోంది. దీన్ని వరల్డ్ నో టొబాకో డేగానూ పిలుస్తారు. ఈ రోజు పొగాకు వాడకం ద్వారా ఆరోగ్యానికి కలిగే దుష్పలితాలు, హానికర ప్రభావాలపై డబ్ల్యూహెచ్‌వో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపడుతుంది. దీని కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతుంది. పొగాకు వాడకాన్ని తగ్గించేందుకు అమలు చేస్తున్న విధానాలను పర్యవేక్షిస్తుంది. పొగాకు ప్రొడక్టులను (సిగరెట్లు, బీడీలు, చుట్టలు) తినగడం, తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పిస్తుంది. పొగ తాగడాన్ని మానడం ఎంత ప్రాముఖ్యమో వెల్లడించడంతో పాటు పొగాకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు, సంస్థలు, ప్రజలు తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తుంది.
వరల్డ్ నో టొబాకో డే నిర్వహించాలని 1987 ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయించి, తీర్మానాన్ని ఆమోదించింది. 1988 ఏప్రిల్‍లో ఈ డే పేరుకు ఆమోదం తెలపగా.. మే 31వ తేదీ నుంచి ప్రతీ సంవత్సరం ఈ పొగాకు వ్యతిరేక దినాన్ని నిర్వహిస్తోంది. ఈ ఏడాది పొగాకు వ్యతిరేక దినాన్ని ప్రత్యేక థీమ్‌తో నిర్వహించనుంది డబ్ల్యూహెచ్‌వో. ఈ ఏడాది వీ నీడ్ ఫుడ్, నాట్ టొబాకో (మాకు ఆహారం కావాలి.. పొగాకు కాదు) అనే థీమ్‌తో జరుపనుంది. సిగరెట్లు, బీడీలు, చుట్టలు సహా పొగాకు ప్రొడక్టులను వాడే వారి హెల్త్ దెబ్బతినే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. పొగాకు ఎక్కువ తాగే వారికి హర్ట్‌ఎటాక్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కిడ్నీలు, ఊపిరితిత్తులు కూడా దెబ్బతింటాయి. పొగాకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం.