ఈ విడాకులు చాలా కాస్టలీ గురూ.

This divorce is very costly guru.భార్యా భర్తలుగా ఉండటం ఇకపై కుదరదని తెలిసి విడిపోయినప్పుడు భర్త ఇచ్చే డబ్బులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 April 2021 1:43 AM GMT
ఈ విడాకులు చాలా కాస్టలీ గురూ.

భార్యా భర్తలుగా ఉండటం ఇకపై కుదరదని తెలిసి విడిపోయినప్పుడు భర్త ఇచ్చే డబ్బులు ఆమెను ఆర్ధికంగా నిలబెడుతుంది. బ్రిటన్ కోర్టుకు ఒక విడాకుల కేసు వచ్చింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విడాకుల కేసులలో ఇది ఒకటి. మామూలుగా అయితే విడాకులు పొందిన మహిళకు భర్త భరణం ఇస్తాడు. కానీ, ఈ కేసులో మాత్రం తల్లికి తనయుడే భరణం చెల్లించాల్సి వచ్చింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.779 కోట్లు అంటే 10.4 కోట్ల డాలర్లు.

అజర్ బైజాన్ కు చెందిన బిలియనీర్ ఫర్ఖాద్ అఖ్మెడోవా మాజీ భార్య టటియానా అఖ్మెడోవా బ్రిటన్ లో యొక్క అతిపెద్ద విడాకుల ప‌రిహారాన్ని పొందారు. ఈ దంపతులకు తేమూర్ అఖ్మదోవ్ అనే కుమారుడున్నాడు. ఈ కుటుంబం బ్రిటన్ లో ఆర్థికంగా బాగా ఎదిగిన కుటుంబం. రష్యాలో కూడా వ్యాపారాలు ఉన్నాయి. మనస్ఫర్థలతో ఈ దంపతులు విడిపోయారు. దీంతో తనకు భరణం కింద 62.7 కోట్ల డాలర్లు ఇవ్వాలంటూ తాతియానా కోర్టుకెళ్లారు. ఆ కేసు కోర్టులో ఉండగానే.. భరణం రాకుండా ఉండేందుకు తన భర్త ఫర్ఖద్, కుమారుడు తెమూర్ లు అడ్డుకుంటున్నారని, ఆస్తుల వివరాలేవీ చెప్పకుండా దాచేస్తున్నారని తాతియానా ఆరోపించారు. లండన్ లోని ఓ లగ్జరీ అపార్ట్ మెంట్ తాళాలను దాచిపెట్టారని దావాలో పేర్కొన్నారు.

గతంలో ఆమె భర్త నుంచి ఒక కళాఖండాన్ని సొంతం చేసుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ క్రమంలోనే ఆమె తన కుమారుడిపై దావా వేశారు. అన్ని ఆస్తులను దాచేస్తున్నారని, తన కుమారుడితో సంబంధాలు దెబ్బతిన్నాయని ఆమె పేర్కొన్నారు. అయితే, తాను చాలా నష్టాల్లో ఉన్నానని, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదివేటప్పుడే ట్రేడింగ్ లో డబ్బులు పెట్టి నష్టపోయానని, ఆ విషయం తన తల్లికీ తెలుసని తెమూర్ వివరణ ఇచ్చాడు.

అయితే, అతడి వ్యాఖ్యలతో విభేదించిన కోర్టు.. ప్రస్తుతం నష్టాల గురించి మాట్లాడడం లేదని వ్యాఖ్యానించింది. తన భర్తకు సంబంధించిన ఆస్తుల వివరాలన్నీ తాటియానా కు దూరంగానే ఉంచారని గుర్తించిన కోర్టు తాతియానాకు రూ.779 కోట్ల భరణం చెల్లించాల్సిందేనంటూ తీర్పునిచ్చింది.


Next Story