ప్రభుత్వం బంపర్ ఆఫర్.. పిల్లలను కంటే రూ.3లక్షలు
This country will offer Rs 3 lakh to people to have kids. పిల్లలను కనే తల్లిదండ్రులకు రూ.3లక్షల ఆర్థిక సాయం
By తోట వంశీ కుమార్ Published on 14 Dec 2022 8:39 AM ISTప్రభుత్వం ఓ ఆఫర్ తీసుకొచ్చింది. పిల్లలను కనే తల్లిదండ్రులకు రూ.3లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇంకెందు ఆలస్యం ఇక ఆ పనిలోనే ఉంటామని అంటారా..? ఒక్కసారి ఆగండి ఈ ఆఫర్ మన దేశంలో కాదండి జపాన్‌లో. అవును మీరు చదివించి నిజమే. ఆదేశంలో పిల్లలను కనే తల్లిదండ్రులకు ఇచ్చే నగదును పెంచింది.
ఇటీవల కాలంలో జపాన్‌లో పిలల్ల జననాల సంఖ్య తగ్గిపోతుంది. దీంతో యువత సంఖ్య క్రమంగా తగ్గుతోంది. దీనిపై ప్రభుత్వం చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తోంది. జనన రేటును పెంచేందుకు జపాన్ ప్రభుత్వం నడుం బిగించింది. పిల్లలను కనేలా ప్రజలను ప్రోత్సహిస్తోంది. ఎక్కువ మంది పిల్లలను కనండి అంటూ ఆఫర్లు ప్రకటిస్తోంది. పిల్లలను కంటే రూ.2.50లక్షలు ఇస్తామంటూ గతంలోనే ప్రకటించింది.
అయినప్పటికీ ప్రజల ఆలోచనా తీరులో మార్పు రాలేదు. దీంతో తాజాగా ఈ మొత్తాన్ని రూ.3లక్షలకు పెంచింది. 2023 ఆర్థిక సంవత్సరం నుంచి ఇది అమల్లోకి రానుంది. గతేడాది జపాన్‌లో 8,11,604 మంది పిల్లలు పుట్టగా ఆ ఏడాదిలో మరణించిన వారి సంఖ్య 14లక్షలకు పైగా ఉంది. 100 ఏళ్లు దాటిన వారి సంఖ్య 86 వేలు ఉంది. వీరిలో 88 శాతం మహిళలు ఉన్నారు.
2021 ప్రభుత్వ లెక్కల ప్రకారం జపాన్‌లో అత్యల్ప సంఖ్యలో పిల్లలు పుట్టారు. దీంతో జనాభా పెరుగుదల కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొత్తగా పెళ్లైన జంటకు జనాభా పెరుగుదల ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తోంది. పిల్లలను కంటే ఇచ్చే నగదు ప్రోత్సాహాకాన్ని పెంచింది.