ఏకంగా అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్

టాలీవుడ్ నటుడు రామ్ చరణ్ తాజా చిత్రం గేమ్ ఛేంజర్ మీద బజ్ పెంచడానికి చిత్ర యూనిట్ భారీగా ప్లాన్ చేస్తోంది.

By Kalasani Durgapraveen  Published on  24 Nov 2024 8:00 AM IST
ఏకంగా అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్

టాలీవుడ్ నటుడు రామ్ చరణ్ తాజా చిత్రం గేమ్ ఛేంజర్ మీద బజ్ పెంచడానికి చిత్ర యూనిట్ భారీగా ప్లాన్ చేస్తోంది. అమెరికాలో గ్రాండ్ గా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ చేయనున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ డిసెంబర్ 21న టెక్సాస్‌లో జరగనుంది. ఇండియన్ ఎంటర్‌ప్రెన్యూర్ రాజేష్ కల్లేపల్లి ఈ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఎన్నారైలు కూడా హాజరు కానున్నారు.

ఈ ఈవెంట్‌కి గేమ్ ఛేంజర్ సినిమా తారాగణం, సిబ్బంది కూడా హాజరవుతారు. ఈ చిత్రం ప్రచార కార్యకలాపాలను తదుపరి స్థాయికి తీసుకువెళడానికి ఈ ఈవెంట్ ఉపయోగపడనుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ యూట్యూబ్‌లో 2 వారాల్లోనే 48 మిలియన్ల వ్యూస్‌ను అందుకుంది. గేమ్ ఛేంజర్ కూడా 10 జనవరి, 2025న సంక్రాంతి బొనాంజాగా విడుదల కానుంది. దర్శకుడు శంకర్ కెరీర్ లో అత్యంత దారుణమైన ఫ్లాప్ ఇండియన్ 2 సినిమా తర్వాత వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్ కావడంతో కొన్ని అనుమానాలు మొదట నెలకొన్నాయి. అయితే గేమ్ ఛేంజర్ టీజర్ సినిమాపై ఉన్న అన్ని అనుమానాలను పటాపంచలు చేసింది.

Next Story