నీట మునిగిన యుద్ధ నౌక‌.. 31 మంది గ‌ల్లంతు

Thailand warship capsizes leaving 31 sailors missing.స‌ముద్రంలో గ‌స్తీ నిర్వ‌హిస్తున్న థాయ్‌లాండ్‌కు చెందిన‌ భారీ యుద్ధ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Dec 2022 4:03 AM GMT
నీట మునిగిన యుద్ధ నౌక‌.. 31 మంది గ‌ల్లంతు

స‌ముద్రంలో గ‌స్తీ నిర్వ‌హిస్తున్న థాయ్‌లాండ్‌కు చెందిన‌ భారీ యుద్ధ నౌక మునిగిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో 31 మంది గ‌ల్లంతు అయ్యారు. గ‌ల్ఫ్ ఆఫ్ థాయ్‌లాండ్ జ‌లాల్లో హెచ్‌టీఎంఎస్ సుఖోథాయ్ అనే యుద్ధ నౌక గ‌స్తీ కాస్తుంటుంది. ఆ ప్రాంతంలో వేట‌కొచ్చే చేప‌ల ప‌డ‌వ‌ల సిబ్బందికి అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో స‌హాయ‌క కార్య‌క్ర‌మాల బాధ్య‌త‌ల‌ను ఈ నౌక చూసుకునేది.

ఆదివారం రాత్రి ఈదురుగాలులు బ‌లంగా వీయ‌డంతో పాటు భారీ అల‌లు ధాటికి ఓడ‌లోకి నీరు చేరింది. అదే స‌మ‌యంలో విద్యుత్ వ్య‌వ‌స్థ స్తంభించింది. దీంతో నీటిని బ‌య‌ట‌కు పంపే అవ‌కాశం లేకుండా పోయింది. క్ర‌మంగా ఓడ వైపుకు ఒరిగిపోసాగింది. నీరు మరింతగా పోటెత్తడంతో అది మునిగిపోయింది. ఆ స‌మ‌యంలో ప‌డ‌వ‌లో 106 మంది ఉన్నారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే అధికారులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు.

77 మందిని ర‌క్షించారు. మ‌రో 31మంది గ‌ల్లంతు అయ్యారు. వారి కోసం నౌక‌లు, హెలికాఫ్ట‌ర్ల సాయంతో గాలింపు చేప‌ట్టారు. స‌హాయ‌క చ‌ర్య‌లు ఇంకా కొన‌సాగుతున్నాయి. అంద‌ర‌ని ర‌క్షించ‌డ‌మే త‌మ ముందు ప్ర‌ధాన ల‌క్ష్య‌మ‌ని రాయల్ నేవీ అధికార ప్రతినిధి అడ్మిరల్ పోకరోంగ్ మోంథపలిన్ చెప్పారు. రక్షించిన వారిలో కొందరిని ఆస్ప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు తెలిపారు. ప్ర‌తికూల వాతావ‌ర‌ణం కార‌ణంగా స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు ఆటంకం ఏర్ప‌డుతోంద‌న్నారు.

Next Story