మరోసారి నెంబర్ వన్ స్థానానికి చేరుకున్న మస్క్

ప్రపంచ కుబేరుల స్థానంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరోసారి నెంబర్ స్థానానికి చేరుకున్నారు. మొదటి స్థానంలో ఉన్న బెర్నార్డ్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Jun 2023 9:45 AM GMT
Tesla CEO, Elon Musk, world richest person, international news

మరోసారి నెంబర్ వన్ స్థానానికి చేరుకున్న మస్క్ 

ప్రపంచ కుబేరుల స్థానంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరోసారి నెంబర్ స్థానానికి చేరుకున్నారు. మొదటి స్థానంలో ఉన్న బెర్నార్డ్ అర్నాల్న్ సంపాదన తగ్గడంతో మస్క్ లిస్టులో ముందుకు వచ్చారు. అర్నాల్ట్‭కు చెందిన లగ్జరీ వస్తువుల తయారీ కంపెనీ ఎల్‭వీఎమ్‭హెచ్ షేర్లు తాజాగా 2.6 శాతం పడిపోయాయి. దీంతో ఎల్‭వీఎమ్‭హెచ్ మార్కెట్ వాల్యూ 10 శాతం కుంచించుకుపోయింది. ఒకే రోజులో ఎల్‭వీఎమ్‭హెచ్ 11 బిలియన్ డాలర్లు నష్టపోయిందని బ్లూంబర్గ్ నివేదిక తెలిపింది. డిసెంబర్ 2022లో ప్రపంచంలో మస్క్ కంపెనీ టెస్లా విలువ బాగా పడిపోవడంతో లగ్జరీ బ్రాండ్ లూయిస్ విట్టన్ మాతృ సంస్థ అయిన ఎల్‭వీఎమ్‭హెచ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆర్నాల్ట్ అత్యంత ధనవంతుడిగా నిలిచారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం మస్క్ సంపద ప్రస్తుతం 192.3 బిలియన్ డాలర్లు కాగా, ఆర్నాల్ట్ సంపద 186.6 బిలియన్ డాలర్లుగా ఉంది.

టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ ట్విటర్‌ను 44 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ట్విటర్‌ విలువ మూడో వంతుకు పడిపోయిందని ప్రముఖ ఆర్ధిక సంస్థ ఫిలిడెలిటీ తెలిపింది. ట్విటర్‌లో ఉన్న ఫిడిలిటీ వాటాలను కొన్న ధరలతో పోల్చితే 44 శాతానికి తగ్గించింది. డిసెంబర్‌, ఫిబ్రవరిలో వాటాల విలువ మరింత తగ్గినట్లు తెలిపింది. మస్క్‌ ట్విటర్‌ను కొనుగులు చేసే నాటికే కంపెనీ ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉంది. మస్క్‌ కొనుగోలు చేసిన తరువాత ట్విటర్‌ ఆర్ధిక ఇబ్బందులు మరింత పెరిగాయి. ఆదాయాన్ని పెంచుకునేందుకు ఆయన అనేక మార్పులు చేశారు. ట్విటర్‌ కొనుగోలుకు మస్క్‌ స్వయంగా 25 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేశారు. ఆ పెట్టుబడి విలువ ఇప్పుడు 8.8 బిలియన్‌ డాలర్లుకు తగ్గినట్లు ఫిడెలిటి తెలిపింది.

Next Story