బాంబును ఢీకొట్టిన బస్సు.. భారీ పేలుడు.. 10 మంది మృతి

Ten civilians killed in roadside bomb in Burkina Faso. ఆఫ్రికా దేశమైన బుర్కినా ఫాసోలో భారీ బాంబు పేలుడు సంభవించింది. తూర్పు బుర్కినా ఫాసాలో

By అంజి  Published on  27 Dec 2022 9:36 AM IST
బాంబును ఢీకొట్టిన బస్సు.. భారీ పేలుడు.. 10 మంది మృతి

ఆఫ్రికా దేశమైన బుర్కినా ఫాసోలో భారీ బాంబు పేలుడు సంభవించింది. తూర్పు బుర్కినా ఫాసాలో ఓ బస్సు రోడ్డు పక్కన ఉన్న బాంబును ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారని స్థానిక ప్రభుత్వం తెలిపింది. ప్రయాణీకులతో వెళ్తున్న ఓ మినీబస్సు ఆదివారం మధ్యాహ్నం బౌగుయ్ గ్రామం సమీపంలో అదుపు తప్పి ఓ గనిని ఢీకొట్టింది అని కల్నల్ హుబర్ట్ యామియోగో తెలిపారు. దీంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. విషయం తెలుసుకున్న అధికారులు, సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

క్షతగాత్రులను తూర్పులోని ప్రధాన పట్టణమైన ఫాడా ఎన్‌గౌర్మాలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. బస్సులోని కొందరు ప్రయాణికులు గల్లంతయ్యారని యామియోగో చెప్పారు. ప్రభుత్వం ఆ ప్రాంతంలో భద్రతను పునరుద్ధరించడంతోపాటు గల్లంతైన ప్రయాణికుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తోంది. మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్‌ ఉందని స్థానిక ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే గడిచిన శనివారం రోజున కూడా ఔగరా, మటియాకోలీ ప్రాంతాల్లో బాంబు దాడులు జరగగా.. ఐదుగురు సైనికులు మృతి చెందారు.

ఇస్లామిక్‌ ఉగ్రవాదం

అల్-ఖైదా, ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌తో ముడిపడి ఉన్న హింస ఆరేళ్లకు పైగా దేశాన్ని నాశనం చేసింది. వేలాది మందిని చంపింది. దాదాపు 2 మిలియన్ల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. దాడులను అరికట్టడంలో ప్రభుత్వం అసమర్థత కారణంగా ఈ ఏడాది రెండు తిరుగుబాట్లు జరిగాయి. ప్రతి జుంటా నాయకుడు భద్రతకు ప్రాధాన్యత ఇస్తానని ప్రతిజ్ఞ చేశారు. అయినప్పటికీ, దాడులు కొనసాగుతున్నాయి. పౌరులు స్వేచ్ఛగా వెళ్లకుండా నిరోధించే జిహాదీలచే పట్టణాలు ముట్టడి చేయబడ్డాయి.

Next Story