తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాకు చెందిన 21 ఏళ్ల సాయినికేష్ రవిచంద్రన్ అనే విద్యార్థి రష్యాకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఉక్రెయిన్‌లోని పారామిలటరీ దళాలలో చేరాడు. అధికారులు ఆయన నివాసానికి వెళ్లి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. అతను ఇండియన్ ఆర్మీలో చేరడానికి దరఖాస్తు చేసుకున్నాడని, కానీ తిరస్కరించబడిందని వారు తెలుసుకున్నారు. 2018లో ఖార్కివ్‌లోని నేషనల్ ఏరోస్పేస్ యూనివర్శిటీలో చదువుకోవడానికి సాయినికేష్ ఉక్రెయిన్ వెళ్లారు. అతను జూలై 2022 నాటికి కోర్సును పూర్తి చేయాల్సి ఉంది.
ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధం మధ్యలో, అతని కుటుంబం సాయినికేష్‌తో కమ్యూనికేషన్ కోల్పోయింది. రాయబార కార్యాలయం సహాయం కోరిన తర్వాత, వారు సాయినికేష్‌ను సంప్రదించగలిగారు. రష్యాకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఉక్రెయిన్ పారామిలిటరీ దళాల్లో చేరినట్లు కుటుంబసభ్యులకు తెలియజేశారు. వాలంటీర్లతో కూడిన జార్జియన్ నేషనల్ లెజియన్ పారామిలిటరీ యూనిట్‌లో భాగంగా రవిచంద్రన్ ఉక్రేనియన్ దళాలలో చేరినట్లు తమిళనాడు ప్రభుత్వం కేంద్రానికి తెలియజేసింది.
12వ తరగతి ఉత్తీర్ణత సాధించిన తర్వాత, రవిచంద్రన్ భారత్ ఆర్మీలో చేరేందుకు ప్రయత్నించారు, కానీ దానిని సాధించడంలో విఫలమయ్యారు. ఆ తర్వాత, తనకు అమెరికా సైన్యంలో చేరే అవకాశం ఉందో లేదో తెలుసుకోవడానికి చెన్నైలోని యుఎస్ కాన్సులేట్‌ను సంప్రదించాడు. వారు అంగీకరించని కారణంగా సాయినికేష్ సెప్టెంబర్ 2018లో ఖార్కివ్‌లోని నేషనల్ ఏరోస్పేస్ యూనివర్సిటీని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. అయితే తాజాగా యుద్ధం కారణంగా సాయినికేష్ కుటుంబం అతనితో కమ్యూనికేషన్ కోల్పోయింది. రాయబార కార్యాలయాన్ని సంప్రదించిన తర్వాత, రష్యాతో పోరాడేందుకు 21 ఏళ్ల యువకుడు ఉక్రేనియన్ పారామిలిటరీ దళాలలో చేరినట్లు వారు తెలుసుకున్నారు.