విదేశీ కరెన్సీపై నిషేదం విధించిన తాలిబ‌న్లు.. వాడితే ఇంక అంతే

Taliban bans foreign currencies in Afghanistan.అఫ్గానిస్థాన్‌ను తాలిబ‌న్లు చేజిక్కించుకున్నాక అక్క‌డ ప‌రిస్థితులు చాలా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Nov 2021 11:36 AM IST
విదేశీ కరెన్సీపై నిషేదం విధించిన తాలిబ‌న్లు.. వాడితే ఇంక అంతే

అఫ్గానిస్థాన్‌ను తాలిబ‌న్లు చేజిక్కించుకున్నాక అక్క‌డ ప‌రిస్థితులు చాలా మారిపోయాయి. తాలిబ‌న్లు ప్ర‌భుత్వం ఏర్పాటు చేసి పాలిస్తున్న‌ప్ప‌టికి అక్క‌డి ప్ర‌భుత్వాన్ని చాలా దేశాలు గుర్తించేందుకు ముందుకు రావ‌డం లేదు. ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు, దేశాన్ని అభివృద్ధి వైపు నడపడం లాంటివి గాక కేవలం తమకు తెలిసిన రాక్షస పాలన, ఏకాధిపత్య నిర్ణయాలను మాత్రమే అనుసరిస్తూ వస్తున్నారు తాలిబ‌న్లు. ఇప్ప‌టికే ఆ దేశ‌ జాతీయ క‌రెన్నీ విలువ దారుణంగా ప‌తన‌మైంది. విదేశీమార‌క నిల్వ‌లు కూడా దాదాపుగా అడుగంటిపోతున్నాయి. ఆదేశంలోని బ్యాంకుల్లో ఉన్న న‌గదు క్ర‌మంగా త‌గ్గిపోతుంది.

ప్ర‌పంచ దేశాలు తాలిబ‌న్ల ప్ర‌భుత్వాన్ని గుర్తించక‌పోవ‌డంతో ఆ దేశానికి క‌ష్టాలు మ‌రింత రెట్టింపు అయ్యాయి. ఆ దేశంలో చాలా వ‌ర‌కు అమెరికా డాల‌ర్ల రూపంలో వాణిజ్యం న‌డుస్తుంది. పాకిస్థాన్ బోర్డ‌ర్ దారిలో పాక్ క‌రెన్సీని కూడా వినియోగిస్తారు. ఈ నేప‌థ్యంలో తాలిబ‌న్లు మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. అఫ్గాన్‌లో విదేశీ క‌రెన్సీపై నిషేధం విధించారు. స్వ‌దేశీ వ్యాపారం కోసం విదేశీ క‌రెన్సీ వాడే వారిని శిక్షిస్తామ‌ని తాలిబ‌న్ల ప్ర‌తినిధి జ‌బియుల్లా ముజాహిద్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. దేశ ప్ర‌యోజ‌నాల దృష్ట్యా ఇక‌పై అఫ్గాన్ వాసులంద‌రూ.. ప్ర‌తి లావాదేవీని అఫ్గాన్ క‌రెన్సీలోనే చేయాల‌ని స్ప‌ష్టం చేశారు. ప్రస్తుతం తాలిబ‌న్లు తీసుకున్న ఈ నిర్ణయం కార‌ణంగా అప్గాన్ ఆర్థిక వ్యవస్థ మరిన్ని ఇబ్బందుల్లో ప‌డే అవ‌కాశం ఉంది.

Next Story