నాలుగు నెలల తరువాత తొలి సూర్యోదయం.. ఎక్కడో తెలుసా..?
Sun rises in Antarctica after four months of darkness.సాధారణంగా ప్రతి రోజు సూర్యోదయం, సూర్యాస్తమయం చూస్తూనే ఉంటాం.
By తోట వంశీ కుమార్ Published on 23 Aug 2022 2:52 AM GMTసాధారణంగా ప్రతి రోజు సూర్యోదయం, సూర్యాస్తమయం చూస్తూనే ఉంటాం. సూర్యుడు ఓ రెండు రోజులు కనిపించకపోతేనే మనం అల్లాడిపోతుంటాం. వర్షాకాలంలో ఇలాంటివి జరుగుతుంటాయి. తుఫాన్లు సమయంలో ఒక్కొసారి వారం పాటు సూర్యుడు కనిపించకపోయినప్పటికి కొద్దొ గొప్పే సూర్యుడి కిరణాలను నేలను తాకుతుంటాయి. అయితే.. సూర్యుడు నాలుగు నెలల పాటు కనిపించకపోతే ఏముతుంది..?
అంటార్కిటికా ఖండంలో ఈ ఘటన జరిగింది. నాలుగు నెలల విరామం తరువాత అక్కడ సూర్యుడు ఉదయించాడు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈ విషయాన్ని వెల్లడించింది. మంచు కొండల మధ్యలోంచి సూర్యుడు తొంగిచూశాడని కాంకోర్డియా పరిశోధనా స్టేషన్‌లోని 12మంది సభ్యుల బృందం తెలిపింది.
ప్రపంచ వ్యాప్తంగా నాలుగు కాలాలుంటే.. అంటార్కికాలో మాత్రం రెండే కాలాలుంటాయి. అవి ఒకటి వేసవి కాలం కాగా.. మరొకటి శీతాకాలం. ఎప్పుడు మైనస్ డిగ్రీలో ఉష్ణోగ్రతలు ఉండే అక్కడ శీతాకాలంలో ఏకంగా -70,-80లకు పడిపోతాయి. ఇక సూర్యుడు కూడా కనిపించదు. కనీసం సూర్య కిరణాలు సైతం అక్కడ భూమిని తాకవు. ఈ నాలుగు నెలల పాటు అక్కడ చిమ్మ చీకటి ఉంటుంది. ఈ కాలాన్ని శాస్త్రవేత్తలు 'బంగారు గని' గా అంటుంటారు. ఈ సమయంలో బయోమెడికల్ పరిశోధనలతో పాటు వివిధ అంశాలపై ఇక్కడ పరిశోధనలు చేస్తుంటారు.
ప్రస్తుతం వేసవి కాలం ప్రారంభం కావడంతో అక్కడ సూర్యుడు ఉదయించాడు. నాలుగు నెలల సుదీర్ఘ విరామం తరువాత తొలి సూర్యోదయానికి సంబంధించి వైద్యుడు హన్నెస్ హాగ్సన్ ఫోటో తీయగా ఈఎస్ఏ దానిని విడుదల చేసింది.