సూయాజ్ కాలువలో ట్రాఫిక్ జామ్.. సామాన్యులపై ఎఫెక్ట్ ఏంతంటే..
Suez Canal still blocked. ఎవర్గ్రీన్ నౌక సూయజ్ కాలువ లో చిక్కుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఇది ఎలా జరిగింది దీని పర్యవసానం ఏమిటో తెలుసా
By Medi Samrat Published on 28 March 2021 12:03 PM ISTరండి కథేంటో చూద్దాం..
మధ్యధరా, హిందూ మహాసముద్రాలను కలుపుతూ ఈజిప్టులో కృత్రిమంగా నిర్మించినది సుయిజ్ కాలువ. ప్రపంచ వాణిజ్యానికి ఇది వెన్నెముక ఎందుకంటే మొత్తం ప్రపంచ వాణిజ్యంలో 12 శాతం సరుకు రవాణా దీని ద్వారా జరుగుతుంది. అందుకే ప్రధానమైన జల మార్గాలలో ఒకటి. దీని పొడవు 193 కి.మీ వెడల్పు సుమారు 200 మీటర్లు. ఈ రోజు 50కిపైగా వాడలో ఈ కాలువ గుండా ప్రయాణిస్తాయి.
ఇంతకీ ఏం జరిగిందంటే..
ఈనెల 23న సూయజ్ కాలువ దక్షిణ ద్వారం దగ్గర చైనా నుండి నెదర్లాండ్స్ కు వెళుతున్న ఒక కార్గో నౌక కాలువలో చిక్కుకుపోయింది. ఆ నౌక పేరు ఎవర్గ్రీన్.. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కంటైనర్ నౌక. 400 మీటర్ల పొడవు.. దాదాపు 60 మీటర్ల వెడల్పు ఉండే ఈ నౌకకు 20వేల కంటైనర్ల వరకు మోసుకెళ్లే సామర్ధ్యం ఉన్నది. దీని బరువు 2.24 లక్షల టన్నులు. అలాంటి ఎవర్గ్రీన్ ఇసుక తుఫానులు తీవ్ర గాలుల ధాటికి నియంత్రణ కోల్పోయి అడ్డంగా తిరిగిపోయింది. దీంతో నౌక ముందు భాగం కాలువ అంచున ఉన్న ఇసుక బంకమట్టి లో కూరుకుపోయింది. నౌకను సరైన మార్గంలో పెట్టడానికి ప్రయత్నాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి.
నౌక కదలకపోతే నష్టం ఏంటి..
ఇంత పెద్ద నౌక సూయజ్ కాలువలో అడ్డంగా నిలిచిపోవడంతో తిప్పలు తీవ్రమయ్యాయి. సాధారణంగా సూయజ్ కాలువ రోజుకు 95 నౌకలు ప్రయాణిస్తాయి.ఇప్పుడు ఎవర్గ్రీన్ ఇలా అడ్డంగా చిక్కుకుపోవడంతో నౌకకు అటూ ఇటూ సుమారు మూడు వందల చిన్న చిన్న కార్గో లో నిలిచిపోయి ఉండవచ్చని అంచనా.
భారీ సంఖ్యలో ఇరువైపులా కంటైనర్ నౌకలు, చమురు ట్యాంకర్లు ఆగిపోయాయి. ఇక్కడ రవాణా నిలిచిపోతే.. చమురు ధరలు మరింత పెరిగే ప్రమాదం వుంది.పోనీ ఇతర నౌకలు అయినా ఈ మార్గాన్ని వదిలేసి.. వేరే మార్గంలో వెళితే.. ఎంతో టైం వెస్ట్ అవడంతోపాటు.. ప్రయాణ భారం నాలుగింతలవుతుంది. ఒక్కో నౌక ఈ కెనాల్‌ను దాటేందుకు 11 నుంచి 18 గంటల సమయాన్ని తీసుకుంటాయి.
మనకేంటి నష్టం :
సూయజ్ కాలువ ద్వారా ముడి ఉత్పత్తులను ఎగుమతి చేసే దేశాల్లో రష్యా, సౌదీ అరేబియా, ఇరాక్, లిబియా, అల్జీరియా ముందున్నాయి. వీటి తర్వాత భారత్ ఆరో స్థానంలో ఉంది. అందుకే, భారత్లో కూడా చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.చమురు ఉత్పత్తి, రవాణా ఆగిపోతే ఇంధన ధరలు మరింత పెరుగుతాయి. ఇంధన ధరలకు ద్రవ్యోల్బణానికి సంబంధం ఉందన్న విషయం తెలిసిందే. డీజిల్ ధరలు పెరిగితే వస్తుసేవల వినియోగానికి అయ్యే ఖర్చు పెరుగుతుంది. ఫలితంగా మన కొనుగోలు శక్తి తగ్గుతుంది. దీంతో డిమాండ్ లేక ఉత్పత్తి ఆపేయాల్సి వస్తుంది. ఫైనల్ గా దేశ వృద్ధిరేటు తగ్గుతుంది. కరోనా తరువాత పెరిగిన ద్రవ్యోల్బణం ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తోంది. తాజా ధరల పెరుగుదల వల్ల ఇది మళ్లీ పెరిగే అవకాశం ఉంది. ఎక్కువ రోజులు సూయజ్ కాలువ బ్లాక్ కావడం వల్ల ఇతర దేశాలతో పాటు భారత్ కూడా నష్టపోతుంది. ధరల పెరుగుదల వినియోగ స్థాయులపై పడటం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ రికవరీ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
వీటితో పాటు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పలు పదార్థాలు కూడా సూయజ్ కెనాల్ ద్వారానే రావాల్సి వస్తుండడంతో దిగుమతి చేసుకునే ఆహార పదార్థాల ధరలు కూడా పెరగనున్నాయి.