శ్రీలంకలో బురఖా బ్యాన్..

Sri Lanka announces burqa ban.ముస్లిం మహిళలు బహిరంగ ప్రదేశాల్లో బురఖా ధరించడాన్ని నిషేధిస్తూ.. శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 April 2021 2:05 AM GMT
burqa ban

బురఖా.. ముస్లిం మహిళలను దీని నుంచి విడిగా చూడలేం.ముస్లింలు దైవగ్రంధంగా భావించే ఖురాన్లో, ఇంకా తాము అత్యధికంగా గౌరవించే, ప్రేమించే ప్రవక్త బోధనల్లో నిండుగా, హూందాగా బట్టలు ధరించండి అన్న మాటలకు ఆచరణే ఈ బురఖా..నిజనికి చాలామంది ఎటువంటి బలవంతం లేకుండా భగవంతుని మీద ప్రేమతో, నమ్మకంతో దీనిని దారిస్తారు.. అయితే శ్రీలంక ప్రభుత్వం ముస్లిం మహిళల విషయంలో తీసుకున్న ఓ నిర్ణయం అందరిని ఆశ్చర్య పరిచింది.

ముస్లిం మహిళలు బహిరంగ ప్రదేశాల్లో బురఖా ధరించడాన్ని నిషేధిస్తూ.. శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 2019లో ఈస్టర్‌ రోజున నేషనల్‌ తావీద్‌ జమాత్‌ ఆత్మాహుతి దళానికి చెందిన 9 మంది ఉగ్రవాదులు బురఖా ధరించి చర్చ్‌లు, హోటళ్లపై పేలుళ్లకు తెగబడి వందల ప్రాణాలను బలితీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘోరకలి ఒక్క శ్రీలంకనే కాదు.. యావత్‌ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. శ్రీలంకలో జరిగిన ఈ వరుసల దాడుల్లో సుమారు 270 మందికి పైగా మరణించిగా.. 500 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో కొంతమంది భారతీయులు కూడా ఉన్నారు.

అందుకే ఆ దేశ జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకున్న శ్రీలంక ప్రభుత్వం.. బహిరంగ ప్రదేశాల్లో ముఖాన్ని పూర్తిగా కప్పి ఉంచే ముసుగులు ధరించరాదని కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని మంగళవారం ఆమోదించింది. కేబినెట్‌ నిర్ణయాన్ని పార్లమెంటు ఆమోదించిన వెంటనే చట్టంగా మారుతుంది. ఈ విషయాన్ని కేబినెట్‌ ప్రతినిథి రాంబుక్వెల్లా మీడియాకు తెలిపారు. శ్రీలంక ప్రజాభద్రత శాఖ మంత్రి శరత్ వీరశేకర ఈ ప్రతిపాదన చేశారు. జాతీయ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాలని శరత్ సూచించారు. బుర్ఖా ధారణను ఆయన మత సంబంధిత అతివాదంగా అభివర్ణించారు. అయితే, కరోనా నేపథ్యంలో మాస్కులు ధరించడంపై మాత్రం ఎలాంటి ఆంక్షలు లేవు.
Next Story