రష్యాలో కాల్పుల కలకలం.. 10మందికిపైగా మృతి

Shooting at Russian University kills Ten.రష్యాలో కాల్పుల కలకలం రేగింది. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో దాదాపు

By అంజి  Published on  21 Sep 2021 2:31 AM GMT
రష్యాలో కాల్పుల కలకలం.. 10మందికిపైగా మృతి

రష్యాలో కాల్పుల కలకలం రేగింది. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో దాదాపు 10 మందికిపైగా మృతి చెందినట్లు తెలిసింది. అలాగే చాలా మందికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన పెర్మ్‌ నగరంలోని ఓ యూనివర్సిటీలో జరిగింది. యూనివర్సిటీ క్యాంపస్‌లోకి తుపాకీతో వచ్చిన దుండగుడు అక్కడున్న విద్యార్థులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. తుపాకీ ఫైరింగ్ శబ్దాలతో ఉపాధ్యాయులు, విద్యార్థులు అక్కడి నుంచి కీటికీల గుండూ దుకుతూ పరుగులు తీశారు. అయితే ఈ దారుణానికి ఒడిగట్టింది ఆ యూనివర్సిటీ విద్యార్థేనని పోలీసులు గుర్తించారు. కాగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు 18 ఏళ్ల తైముర్ బెక్మాన్సువర్‌ అని.. అతడి ఈ దాడికి పాల్పడడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నామని రష్యా ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు సంస్థ తెలిపింది. పోలీసుల కాల్పుల్లో గాయపడ్డ నిందితుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితుడు కాల్పులకు పాల్పడే ముందు తుపాకీ, హెల్మెట్‌, మందుగుండు సామాగ్రితో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పెట్టాడు. ''నేను దీని గురించి చాలా సేపు ఆలోచించాను, సంవత్సరాలు గడిచిపోయాయి. నేను కలలుగన్నది చేయడానికి సమయం ఆసన్నమైందని నేను గ్రహించాను'' అంటూ నిందితున తన సోషల్ మీడియా ఖాతో పోస్టు చేశాడని ప్రముఖ మీడియా సంస్థ రాయిటర్స్ తెలిపింది.

ఈ ఘటనపై రష్యా అద్యక్షుడు విచారం వ్యక్తం చేశారు. విద్యార్థులు మృతిచెందడం.. తమ పిల్లలను కోల్పోయిన కుటుంబాలకు మాత్రమే కాకుండా దేశం మొత్తానికి తీవ్ర నష్టమని అన్నారు. ఘటన జరిగిన ప్రదేశం ఆ దేశ రాజధాని మాస్కోకు తూర్పున 1300 కిలోమీటర్ల దూరంలో ఉంది. యూనివర్సిటీలో కాల్పుల శబ్దాలు విని ఒక ప్రొఫెసర్ విద్యార్థులు తరగతి గదుల నుంచి దూకుతున్న వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి. దుండగుడి కాల్పుల నుంచి తప్పించుకునేందుకు తాము తరగది తలుపులు మూసివేసి, కుర్చీలతో అడ్డుకున్నామని విద్యార్థి సెమియాన్ కార్యకిన్‌ మీడియాకు తెలిపాడు.

ఈ మరణహోమంపై రష్యాలోని భారత రాయబార కార్యాలయం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించింది. అలాగే గాయపడ్డ విద్యార్థులు తర్వగా కోలుకోవాలని భారత రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది. పెర్మ్ స్టేట్‌ మెడికల్ యూనివర్సిటీలో చదువుతున్న భారతీయ విద్యార్థులందరూ సురక్షితంగా ఉన్నారని తెలిపింది.

Next Story