హిందువులపై దాడులకు ప్రధాన సూత్రధారి ఆయ‌నే : షేక్ హసీనా

బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై హింస కొనసాగుతోంది. దేశంలో తిరుగుబాటు తర్వాత షేక్ హసీనా భారతదేశంలోనే ఉన్నారు.

By Kalasani Durgapraveen  Published on  3 Dec 2024 12:56 PM IST
హిందువులపై దాడులకు ప్రధాన సూత్రధారి ఆయ‌నే : షేక్ హసీనా

బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై హింస కొనసాగుతోంది. దేశంలో తిరుగుబాటు తర్వాత షేక్ హసీనా భారతదేశంలోనే ఉన్నారు. షేక్ హసీనా తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న మహమ్మద్ యూనస్ సామూహిక హత్యలు, మైనారిటీలను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న మారణహోమానికి మహమ్మద్ యూనస్ కారణమని ఆమె ఆరోపించారు.

న్యూయార్క్‌లో జరిగిన అవామీ లీగ్ కార్యక్రమంలో ప్రసంగించిన హసీనా.. దేవాలయాలు, చర్చిలు, మతపరమైన సంస్థ ఇస్కాన్‌పై యూనస్ తరచూ దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. నాపై సామూహిక హత్యల ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ దాడులకు సూత్రధారి మహ్మద్ యూనస్ అని ఆరోపించారు.

నేడు టీచర్లు, పోలీసులు, నాయకులు, అందరిపైనా దాడులు జరుగుతున్నాయని షేక్ హసీనా అన్నారు. హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులను టార్గెట్ చేస్తున్నారు. 11 చర్చిలు, అనేక దేవాలయాలపై దాడులు జరిగాయి. ఇస్కాన్‌పై దాడి జరిగింది. యూనస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ.. ఇప్పుడు బంగ్లాదేశ్‌లో మైనారిటీలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు.? తన తండ్రి, బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్‌ను హత్య చేసినట్లే.. తనను కూడా హత్య చేసేందుకు ప్లాన్‌లు జ‌రుగుతున్నాయని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

Next Story