చైనా దేశంలో మ‌రో 18 ర‌కాల ప్ర‌మాద‌క‌ర వైర‌స్‌లు

Scientists found 18 more viruses from China.క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని అత‌లాకుత‌లం చేసింది. ఈ మ‌హ‌మ్మారికి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Nov 2021 4:44 PM IST
చైనా దేశంలో మ‌రో 18 ర‌కాల ప్ర‌మాద‌క‌ర వైర‌స్‌లు

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని అత‌లాకుత‌లం చేసింది. ఈ మ‌హ‌మ్మారికి పుట్టినిల్లుగా చెప్పుకునే చైనాలో మ‌రోసారి ప్ర‌మాద‌క‌ర వైర‌స్‌లు వెలుగుచూశాయి. క‌రోనా మ‌హ‌మ్మారి జంతువుల నుంచే మ‌నుషుల‌కు సోకిన‌ట్లు వ‌స్తున్న వార్త‌ల నేప‌థ్యంలో కొంత మంది శాస్త్రవేత్త‌లు చైనాలోని జంతువుల మాంసం విక్ర‌యించే మార్కెట్ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఈ పరిశోధనల్లో ఆస్ట్రేలియా, చైనా, అమెరికా, బెల్జియం శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. మొత్తం 16 ర‌కాల జాతుల‌కు చెందిన 1725 వ‌న్య ప్రాణుల‌పై ప‌రిశోధ‌న‌లు జ‌రిపిన‌ట్లు వెల్ల‌డించారు. ఈ ప‌రిశోధ‌న‌ల్లో 71 ర‌కాల వైర‌స్‌ల‌ను శాస్త్ర‌వేత్త‌ల‌ను క‌నుగొన్నారు. వీటిలో 18 ర‌కాల ప్ర‌మాద‌క‌ర వైర‌స్ ఉన్నాయ‌న్నారు.

చైనా ప్రభుత్వం విక్రయానికి నిషేధించిన జంతువులపైనా పరిశోధనలు చేసినట్లు ఓ శాస్త్రవేత్త తెలిపారు. తాము 71 రకాల వైరస్‌లను కనుగొనగా.. అందులో 45 రకాల కొత్త వైర‌స్ అని చెప్పారు. ఇందులో 18 ర‌కాలు మాన‌వులు, జంతువ‌ల‌కు ప్ర‌మాద‌క‌ర‌మైన‌వి అని చెప్పారు. వైర‌స్‌ల వ్యాప్తిలో వ‌న్య‌ప్రాణులే కీల‌క పాత్ర పోషిస్తాయి అన‌డానికి ఈ వివ‌రాలే ఉదాహ‌ర‌ణ అని చెప్పుకొచ్చారు. పిల్లుల మాదిరిగా ఉండే సివెట్స్ అనే జంతువుల్లో అత్యధికంగా ప్రమాదకర వైరస్‌లు ఉన్నట్లు గుర్తించామన్నారు.

Next Story