దేశ అధ్యక్షులకి తప్పని సైడ్ ఎఫెక్ట్స్
Russian President Putin felt minor side effects from Covid-19 vaccine. టీకా పొందిన తర్వాత తనకు కూడా స్వల్పంగా ఆరోగ్య సమస్య తలెత్తిందని రష్యా అధ్యక్షులు పుతిన్ పేర్కొన్నారు.
By Medi Samrat Published on 29 March 2021 3:24 AM GMTఒక దేశ అధ్యక్షుడు అయినంత మాత్రాన వాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వకుండా పోతుందా.. కరోనాకి ఎలా అయితే ధనిక పేద అన్న బేధం లేదో.. వ్యాక్సిన్ కి కూడా అంతే కదా మరి.. టీకా తీసుకున్నవారిలో స్వల్ప దుష్పభావాలు ఎదురవుతున్నాయని ఇప్పటికే కొన్ని దేశాల్లో విమర్శలు వస్తున్నాయి. అలాగే టీకా పొందిన తర్వాత తనకు కూడా స్వల్పంగా ఆరోగ్య సమస్య తలెత్తిందని రష్యా అధ్యక్షులు పుతిన్ పేర్కొన్నారు.
ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచదేశాలను అతలాకుతలం చేస్తుండడంతో వ్యాక్సిన్లకు అత్యవసర వినియోగం కింద అనుమతులు ఇచ్చారు. అనేక దేశాల్లో అపోహలు ఉన్నప్పటికీ వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతోంది. దేశాధినేతలు సైతం వ్యాక్సిన్ వేయించుకుని ప్రజలను ఆ దిశగా ప్రోత్సహిస్తున్నారు. కాగా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మంగళవారం నాడు కరోనా వ్యాక్సిన్ డోసు తీసుకోగా, ఆయనకు స్వల్పంగా సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయట. ఓ ఇంటర్వ్యూలో పుతిన్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు.
వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రోజు ఉదయం కండరాల నొప్పులతో బాధపడ్డానని తెలిపారు. థర్మామీటర్ తో జ్వరం చూసుకుంటే సాధారణంగానే ఉందని పేర్కొన్నారు. అసలు వ్యాక్సిన్ కేంద్రంలోనే తాను కొద్దిగా అసౌకర్యానికి గురయ్యానని వివరించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా స్పుత్నిక్ వీ టీకా అందుబాటులో ఉందని ఆయన వివరించారు. అయితే పుతిన్ తీసుకున్న వ్యాక్సిన్ వివరాలను మాత్రం సీక్రెట్గా ఉంచారు.
కాగా, దేశంలో 4.3 మిలియన్ల మంది వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నారని పుతిన్ గతంలో ప్రకటించారు. వేసవి చివరి నాటికి అందరిలో రోగనిరోధక శక్తి పెరగాలని కోరుకుంటున్నట్లు రష్యా అధ్యక్షుడు ఆకాంక్షించారు. టీకా పంపిణీ కార్యక్రమాన్ని రష్యా డిసెంబర్‌లోనే ప్రారంభించిన విషయ తెలిసిందే.. ఈ క్రమంలో దేశంలో ఇంకా రెండొంతుల మంది స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ తీసుకోలేదని ఆ దేశ ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు రష్యా లో 4.5 మిలియన్‌ల మంది కరోనా బారినపడ్డట్లు అధికారులు వివరించారు.