సాయం చేసేందుకు విరాళం ఇచ్చినందుకు మహిళకు 12ఏళ్ల జైలు
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 16 Aug 2024 1:51 AM GMTసాయం చేసేందుకు విరాళం ఇచ్చినందుకు మహిళకు 12ఏళ్ల జైలు
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. చర్చలు జరుగుతాయనీ.. కాల్పుల విరమణ ఉంటుందని అనుకున్న ప్రతిసారి ఏదో ఒక కారణంతో రద్దవుతూనే ఉంది. ఫలితంగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. కాల్పుల విరమణ చేపట్టేందుకు రష్యా పలు డిమాండ్లను ముందుంచుతోంది. దానికి ఉక్రెయన్ అంగీకరించడం లేదు. అయితే.. ఉక్రెయిన్‌పై దురాక్రమణ కొనసాగిస్తున్న రష్యా.. శత్రదేశానికి ఎవరైనా మద్దతుగా నిలిస్తే కఠిన చర్యలు తీసకుంటోంది. తాజాగా రష్యాలోని ఒక స్వచ్ఛంద సంస్థకు విరాళాలు స్వీకరించిన అమెరికా-రష్యన్ మహిళకు కఠిన శిక్ష విధించారు.
ఆ మహిళ ఉక్రెయిన్‌లో బాధితుల కోసం కేవలం 51 డాలర్లు అంటే 4200 రూపాయలు ఇచ్చినందుకు దోషిగా తేల్చింది రష్యా కోర్టు. ఆమెకు ఏకంగా 12 ఏళ్ల జైలు శిక్ష విధించారు.వివరాలను పరిశీలిస్తే.. రష్యాకు చెందిన సేనియా ఖవానా (33) డ్యాన్సర్‌గా ఉంది. అఎరికా వ్యక్తిని ఆమె వివాహం చేసుకుని లాస్ ఏంజెల్స్‌లో స్థిరపడిపోయింది. కుటుంబ సభ్యులను కలిసిఏందుకు కొద్దికాలం కిందటే రష్యాలోని స్వస్థలానికి వెళ్లింది. అయితే.. రష్యాలోనే ఉండి ఉక్రెయిన్ సంస్థలకు ప్రయోజనం కలిగేలా పనిచేస్తున్న అమెరికాకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థకు విరాళాలు సేకరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆమెను ఫిబ్రవరిలోనే అరెస్ట్ చేసి విచారణ చేవారు. 51 డాలర్ల నగదును స్వచ్ఛంద సంస్థకు బదిలీ చేసినట్లు ఆమె అంగీకరించింది. వాటిని రష్యా వ్యతిరేక కార్యకలాపాలకు వినిగియించినట్లు కూడా తనకు తెలియదని పేర్కొంది. ఆమెపై దేశద్రోహం కింద అభియోగాలు నమోదు అయ్యాయి. కోర్టు దోషిగా తేల్చి ఏకంగా 12ఏళ్ల జైలు శిక్ష విధించింది.