క్యాన్సర్ రోగులకు శుభవార్త.. టీకాను తయారు చేసినట్లు ప్రకటించిన రష్యా
నేడు ప్రపంచం క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధితో అల్లాడిపోతోంది. ఇంతలో క్యాన్సర్ వ్యాధిని పరిష్కరించడానికి రష్యా పెద్ద ప్రకటన చేసింది..
By అంజి Published on 18 Dec 2024 6:13 AM GMTక్యాన్సర్ రోగులకు శుభవార్త.. టీకాను తయారు చేసినట్లు ప్రకటించిన రష్యా
నేడు ప్రపంచం క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధితో అల్లాడిపోతోంది. ఇంతలో క్యాన్సర్ వ్యాధిని పరిష్కరించడానికి రష్యా పెద్ద ప్రకటన చేసింది.. రష్యా క్యాన్సర్ వ్యాక్సిన్‌ను తయారు చేసిందని.. ఇది పౌరులందరికీ ఉచితంగా అందుబాటులో ఉంటుందని తెలిపింది.
క్యాన్సర్ వ్యాక్సిన్ 2025 ప్రారంభంలో ప్రారంభించబడుతుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన రేడియాలజీ మెడికల్ రీసెర్చ్ సెంటర్ హెడ్ ఆండ్రీ కప్రిన్ తెలిపారు. నివేదికల ప్రకారం.. క్యాన్సర్‌కు వ్యతిరేకంగా రష్యా తన స్వంత mRNA వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది.
రష్యాలోని క్యాన్సర్ రోగులకు 2025 ప్రారంభం నుండి ఉచితంగా అందించబడే క్యాన్సర్ వ్యతిరేక వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్లు రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
రష్యన్ ప్రభుత్వ యాజమాన్యంలోని వార్తా సంస్థ TASS ప్రకారం.. రష్యన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన రేడియాలజీ మెడికల్ రీసెర్చ్ సెంటర్ జనరల్ డైరెక్టర్ ఆండ్రీ కప్రిన్.. ఈ టీకా గురించి రష్యన్ రేడియో ఛానెల్‌లో సమాచారం ఇచ్చారు.
ఈ వ్యాక్సిన్‌ను క్యాన్సర్ రోగులకు చికిత్స చేసేందుకు ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. పాశ్చాత్య దేశాల్లో అభివృద్ధి చేస్తున్న క్యాన్సర్ వ్యాక్సిన్‌ల మాదిరిగానే ఒక్కో రోగికి ఒక్కో వ్యాక్సిన్ రిజిస్టర్ చేయబడిందని రష్యా ప్రభుత్వ శాస్త్రవేత్తలు వ్యాఖ్యానించారు. టీకా ఏ క్యాన్సర్‌కు చికిత్స కోసం రూపొందించబడింది.. ఇది ఎంత ప్రభావవంతంగా ఉంటుంది.. రష్యా దానిని ఎలా అమలు చేయాలని యోచిస్తోందో ప్రస్తుతం అస్పష్టంగా ఉంది. వ్యాక్సిన్ పేరు కూడా వెల్లడించలేదు.
ప్రపంచంలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే రష్యాలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి.. 2022లో 6,35,000 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. దేశంలో పెద్దప్రేగు, రొమ్ము, ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు ఎక్కువ. ఇంతటి ఆందోళనలో క్యాన్సర్ వ్యాక్సిన్ రావడం సంతోషించదగ్గ విషయం.. అయితే అది ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందనేది తెలియాల్సివుంది.