ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దళాల దాడులు ఆగడం లేదు. రష్యా వైమానిక దాడులతో ఉక్రెయిన్ అల్లకల్లోలం అవుతోంది. యుద్ధం యొక్క నాల్గవ రోజు ఆదివారం ఉదయం.. ఉక్రెయిన్‌కు రష్యా మరొక సమస్యను తెచ్చిపెట్టింది. రష్యా సైనికులు ఉక్రెయిన్‌పై పెద్ద దాడిని ప్రారంభించారు. ఉక్రెయిన్ దేశంలోని రెండవ అతిపెద్ద నగరమైన ఖార్కివ్‌లో గ్యాస్ పైప్‌లైన్‌ను రష్యా పేల్చివేసింది. దీంతో చుట్టుపక్కల పొగలు వ్యాపించడంతో పాటు చుట్టుపక్కల వాతావరణంలో విషపూరితమైన గాలి వ్యాపించిందని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ఖార్కివ్‌లో పొగలు కమ్ముకోవడంతో ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారుతోంది.
ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో.. రష్యా దళాలు దేశంలోని రెండవ అతిపెద్ద నగరమైన ఖార్కివ్‌లో గ్యాస్ పైప్‌లైన్‌ను పేల్చివేశాయి. ఈ పేలుడు చాలా ప్రమాదకరమైనది. పేలుడు విపత్తుకు కారణం కావచ్చు. అదే సమయంలో రష్యన్ దాడి తర్వాత స్టేట్ సర్వీస్ ఆఫ్ స్పెషల్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్రొటెక్షన్ స్థానికులు తమ ఇళ్ల కిటికీలను తెరవకూడదని హెచ్చరించింది. శ్వాస సమస్యలు రాకుండా ప్రజలు ముక్కుపై తడి గుడ్డను ఉంచాలని సలహా ఇచ్చింది. పైప్‌లైన్ కారణంగా వెలువడే విషవాయువు ప్రమాదకరమని హెచ్చిరించి ప్రభుత్వం.. దాని నుండి మనల్ని రక్షించుకోవడం చాలా ముఖ్యం అంటూ పేర్కొంది. ఉక్రెయిన్ అధికారి ఇరినా వెండిక్టోవా మాట్లాడుతూ.. రష్యా సైన్యం ఖార్కివ్‌ను స్వాధీనం చేసుకోవాలనుకుంటోంది. కాబట్టి ఇక్కడ ప్రమాదకరమైన పోరాటం జరుగుతోంది. అన్నారు.