గూగుల్ మాతృ సంస్థలో మహిళలకు వేధింపులు.. 500 మంది బహిరంగ లేఖ రాయడంతో..!

Harassment on Google Women Employees, write an open letter to Sundar Pichai. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్

By Medi Samrat  Published on  12 April 2021 12:27 PM IST
Google
గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ లో మహిళలకు రక్షణ అన్నదే లేకుండా పోయిందా..? ఎందుకంటే న్యూయార్క్ టైమ్స్ ప‌త్రిక‌లో గూగుల్ సంస్థ‌లో జ‌రుగుతున్న వేధింపుల‌పై ఆ సంస్థ‌ మాజీ ఇంజినీర్ ఎమీ నీట్‌ఫీల్డ్ ఇటీవలే ఒక ఆర్టిక‌ల్ రాశారు. అందులో తనపై జరిగిన లైంగిక వేధింపులన్నీ కళ్లకు కట్టినట్లు వివరించారు. గూగుల్ లో పని చేసిన తరువాత నాకు మరో ఉద్యోగం చేయాలని అనిపించడం లేదని.. ఎమీ తన అనుభవాలను చెప్పారు. తనను వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసిన అతనితో పాటే బలవంతంగా ముఖాముఖి భేటీలు చేయించారని కూడా చెప్పుకొచ్చారు. పక్కనే కూర్చోబెట్టారని.. అతనితో కలసి పని చేయడం చాలా ఇబ్బందిగా ఉందని చెప్పినా ఉన్నతాధికారులు ఏ మాత్రమూ పట్టించుకోలేదని.. తననే కౌన్సెలింగ్ తీసుకోవాలని సలహాలు ఇచ్చారని కూడా తెలిపారు. లేకుంటే సెలవుపై వెళ్లాలని సలహాలు ఇచ్చారని ఎమీ సంచలన విషయాలను బయటపెట్టారు. సంస్థలోని ఎంతో మంది విషయంలో అధికారులు ఇలానే ప్రవర్తించారని చెబుతూ 'గూగుల్‌లో ప‌నిచేసిన త‌ర్వాత.. నేను మ‌ళ్లీ ఉద్యోగాన్ని ప్రేమించ‌ను' అనే శీర్షిక‌తో న్యూయార్క్ టైమ్స్‌లో ఆమె క‌థ‌నం ప్రచురించారు.


ఇప్పుడు తమపై వేధింపులు పెరిగిపోయాయని 500 మందికి పైగా ఉద్యోగినులు సంతకాలు చేస్తూ, సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుందర్ పిచాయ్ కి లేఖను రాశారు. త‌మ‌ను ఆదుకొని సుర‌క్షితమైన వాతావర‌ణాన్ని క‌ల్పించాల‌ని 500 మంది ఉద్యోగులు సుంద‌ర్ పిచాయ్‌కు లేఖ రాయడంతో అక్కడ లైంగిక వేధింపుల తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తమను నిత్యమూ వేధిస్తున్న వారిని ఉన్నతాధికారులు రక్షిస్తున్నారని, వారిని నియంత్రించాలని కోరారు. వేధించిన వారినే సమర్ధిస్తున్న వాతావరణం ఉందని, 20 వేల మందికి పైగా పని చేస్తున్న ఆడవాళ్లు లైంగిక వేధింపులకు గురయ్యారని చెబుతున్నారు. వారిపై గూగుల్ సంస్థ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.


Next Story