భారత్ లో రైతుల ఉద్య‌మం గురించి పాప్ సింగర్ రిహన్నా చర్చిద్దామంటోంది

Rihanna's Tweet Takes Farmers' Protest Global, Spurs Support. భారతదేశంలో రైతుల ఆందోళనలు మద్దతుగా ప్రముఖ పాప్ సింగర్ రిహన్నా స్పందించారు.

By Medi Samrat
Published on : 3 Feb 2021 3:34 PM IST

Rihannas Tweet Takes Farmers Protest Global, Spurs Support.

కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అయితే గణతంత్ర దినోత్సవం నాడు ఉద్యమం ఉద్రిక్తతంగా మారి హింస చేలరేగడంతో ప్రభుత్వం ఢిల్లీ బోర్డర్ లో ఇంటర్నెట్ ను ఆపివేసింది. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసనలకు ప్రధాన కేంద్రమైన సింఘూ బార్డర్ ను పోలీసులు దిగ్బంధించారు. రైతులకు మంచి నీటి సరఫరాను నిలిపివేయడంతో పాటు, వారు కాలకృత్యాలు తీర్చుకునేందుకు కూడా వెళ్లే పరిస్థితి లేకుండా చేశారు. నాలుగు నుంచి ఐదడుగుల సిమెంట్ గోడలను నిర్మించిన పోలీసులు, సంయుక్త కిసాన్ మోర్చా నిరసనకారులకు ఢిల్లీతో ఎటువంటి సంబంధం లేకుండా చేశారు.

భారతదేశంలో రైతుల ఆందోళనలు మద్దతుగా ప్రముఖ పాప్ సింగర్ రిహన్నా స్పందించారు. రైతుల ఉద్యమంపై తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు పెట్టారు. ఓ న్యూస్‌ ఆర్టికల్‌ క్లిప్‌ని షేర్‌ చేశారు. " why aren't we talking about this?! #FarmersProtest " మనం ఎందుకు దీని గురించి మాట్లాడటం లేదు అని ప్రశ్నించారు రిహన్నా.‌ సీఎన్‌ఎన్‌ పేపర్ క్లిప్పింగ్ లో రైతులు ట్రాక్టర్ల మీద భారత జాతీయ పతాకాలను పట్టుకుని ఉండడాన్ని గమనించవచ్చు. గణతంత్ర దినోత్సవ వేడుకల నాడు రైతు ఉద్యమం ఉద్రిక్తంగా మారడం.. హింస చేలరేగడంతో ఢిల్లీ చుట్టుపక్కల ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేయడం వంటి విషయాలను ఆర్టికల్ లో ఉంచారు.


భారత్‌లోని రైతులకు సంఘీభావం తెలుపుతున్నామంటూ పర్యావరణ పరిరక్షక కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్ ట్వీట్ చేశారు. ఓ వార్తా ప‌త్రిక‌లో వ‌చ్చిన క‌థ‌నాన్ని ఈ సంద‌ర్భంగా ఆమె పోస్ట్ చేశారు. ఢిల్లీలో రైతుల ఉద్య‌మాన్ని అణ‌చివేసేలా పలు ప్రాంతాల్లో విధించిన ఆంక్షలకు సంబంధించిన సమాచారం ఆమె ట్వీట్ లో ఉంది.


Next Story