భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) గవర్నర్ శక్తికాంత దాస్‌కు 'గవర్నర్ ఆఫ్ ది ఇయర్' అవార్డు లభించింది. దేశంలోని సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌కు లండన్ సెంట్రల్ బ్యాంకింగ్ ఈ గౌరవాన్ని అందించింది. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శక్తికాంత దాస్ చాలా పెద్ద నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా రెండు వేల రూపాయల నోట్లను చలామణిలో లేకుండా చేస్తూ పెద్ద నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ మార్కెల్‌లో అస్థిరత నేపథ్యంలో.. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడంలో ఆయన కీలక పాత్రను పోషించారు. కరోనా సంక్షోభ సమయంలో కూడా తన నిర్ణయాలతో ప్రజల మన్ననలు పొందారు. ఆ సమయంలో కొన్ని నెలల పాటు ఈఎంఐ మినహాయింపులు ఇవ్వాలని బ్యాంకులను ఆదేశించారు.
రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ లండన్‌లో బ్రిటన్ సెంట్రల్ బ్యాంకింగ్ నిర్వహించిన వేసవి సమావేశాల ప్రారంభ ప్రసంగంలో మాట్లాడుతూ.. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే ప్రక్రియ నెమ్మదిగా, సుదీర్ఘంగా ఉంటుందని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణంపై పోరాటం కొనసాగుతోందని ఆర్‌బీఐ గవర్నర్ తెలిపారు. మహమ్మారి సంవత్సరాలలో కూడా మేము వృద్ధికి ప్రాధాన్యత ఇచ్చామని.. ప్రస్తుతం ద్రవ్యోల్బణం లక్ష్యం కంటే ఎక్కువగానే ఉందని అన్నారు. మహమ్మారి-నాశనమైన ఆర్థిక వ్యవస్థలకు ఉద్దీపన అందించడానికి, ద్రవ్యోల్బణంతో పోరాడటానికి కేంద్ర బ్యాంకులు తమ అన్ని ఎంపికలను ఉపయోగించాలని.. విధానాలను మార్చుకోవాలని అన్నారు.