69 ఏళ్ల వయసులో.. మళ్లీ తండ్రి కాబోతున్న పుతిన్!
Putin secreat lover alina kabaeva pregnant. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (69) మళ్లీ తండ్రి కాబోతున్నారని అంతర్జాతీయ మీడియా వర్గాలు తెలిపాయి.
By అంజి Published on 11 July 2022 8:34 AM ISTరష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (69) మళ్లీ తండ్రి కాబోతున్నారని అంతర్జాతీయ మీడియా వర్గాలు తెలిపాయి. పుతిన్ ప్రియురాలు, మాజీ జిమ్నాస్ట్ అలీనా కబేవా (39) త్వరలోనే ఓ పాపకు జన్మనివ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై ఒక్కసారిగా వార్తలు గుప్పుమనడం చర్చనీయాంశమైంది. అలీనాకు ఇప్పటికే పుతిన్ ద్వారా ఇద్దరు కుమారులు, మరో ఇద్దరు కవల అమ్మాయిలు ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. అయితే వారి వివరాలను పుతిన్ గోప్యంగా ఉంచినట్టు సమాచారం. తన కుటుంబం గురించి పుతిన్ బయట మాట్లాడరు.
ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అయినా కబేవా గర్భం దాల్చిందని, త్వరలో ఆమె బిడ్డకు జన్మనివ్వబోతోందని జనరల్ ఎస్వీఆర్ టెలిగ్రాం ఛానెల్ పేర్కొంది. తాజాగా జరిపిన లింగ నిర్దారణ పరీక్షల్లో.. ఆమెకు ఆడపిల్లగా తేలినట్లు వెల్లడించింది. అయితే, దీనిపై పుతిన్ మాత్రం సంతోషంగా లేరని టెలిగ్రాం ఛానెల్ చేసిన పోస్టుపై పుతిన్ అసహనం వ్యక్తం చేసినట్లు ది సన్ ఓ కథనంలో పేర్కొంది. చివరిసారిగా కబేవా.. గత నెలలో బ్లాక్ సీ రిసార్ట్ వద్ద రిథమిక్ జిమ్నాస్టిక్స్ శిక్షణా శిబిరంలో కనిపించడంతో వార్తల్లో నిలిచారు.
అలాగే పుతిన్ మాజీ భార్య లియుద్ మిలాకు ఇప్పటికే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో ఒకరైన మారియా వొరొత్సోవా (37) వ్యాపారవేత్త రాణిస్తుండగా, మరో కుమార్తె కేటెరినా (35) శాస్త్రవేత్త, మాజీ డ్యాన్సర్‌గా పేరు తెచ్చుకున్నారు. పుతిన్ వ్యక్తిగత జీవితం అత్యంత సీక్రెట్‌గా ఉంటుంది. కబేవా 2015లో స్విట్జర్లాండ్‌లోని ఓ క్లినిక్‌లో ఓ బాబుకు జన్మనిచ్చినట్టు 'యూకే మిర్రర్' పేర్కొంది. అలాగే, 2019లో మాస్కోలో కవలలకు జన్మనిచ్చిందని తెలిపింది.