'మిస్‌ వరల్డ్‌ 2000లో కుట్ర జరిగింది'.. ప్రియాంక చోప్రాపై సంచలన ఆరోపణలు

Priyanka Chopras miss world 2000 win rigged says miss barbados leilani mcconney. నటి ప్రియాంక చోప్రా ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందాల పోటీల్లో విజయం సాధించి, ఆ తర్వాత

By అంజి  Published on  4 Nov 2022 1:15 PM IST
మిస్‌ వరల్డ్‌ 2000లో కుట్ర జరిగింది.. ప్రియాంక చోప్రాపై సంచలన ఆరోపణలు

నటి ప్రియాంక చోప్రా ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందాల పోటీల్లో విజయం సాధించి, ఆ తర్వాత బాలీవుడ్‌లో అడుగుపెట్టి, ఆ తర్వాత హాలీవుడ్‌లో ఖ్యాతి గడించిన ఆమె సాధించిన ఘనత చిన్నదేమీ కాదు. ఆమె 2000 సంవత్సరంలో మిస్ వరల్డ్ 2000 కిరీటాన్ని పొందింది. అది ఆమె జీవితాన్ని మార్చేసింది. ఎన్నో సినిమాలు చేసి పేరు తెచ్చుకుంది. అయితే 22 ఏళ్ల తర్వాత మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న ప్రియాంక చోప్రాపై ఓ సంచలన ఆరోపణ ఎదురైంది. రిగ్గింగ్‌ కారణంగానే ప్రియాంక 'మిస్ వరల్డ్ 2000' కిరీటాన్ని గెలుచుకుందని మాజీ మిస్ బార్బడోస్ లీలానీ మెక్‌కానీ ఆరోపించారు .

ప్రస్తుతం 'మిస్ యుఎస్‌ఎ 2022' పోటీలో రిగ్గింగ్‌ జరిగిందంటూ చాలా చర్చ జరుగుతోంది. ఈ పోటీలో టెక్సాస్‌కు చెందిన రాబోన్‌ గాబ్రియేల్‌ కిరీటం గెల్చుకుంది. అయితే ఆమె చీటింగ్‌ చేసి కిరీటం గెల్చుకుందంటూ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయంపై మాట్లాడిన లెలానీ మెకోనీ.. 2000 నాటి 'మిస్ వరల్డ్' పోటీని విమర్శించారు. ఆ పోటీలో లేలానీ మెకోనితో పాటు ప్రియాంక చోప్రా కూడా పాల్గొన్నారు. కానీ రిగ్గింగ్‌ కారణంగానే ఆ ఏడాది ప్రియాంక చోప్రా కిరీటాన్ని గెలుచుకుందని లెలానీ మెకోనీ ఆరోపించారు.

లెలానీ మెకోనీ ఈ ఆరోపణ చేయడానికి కొన్ని కారణాలను కూడా చెప్పారు. ఆమె చెప్పిన దాని ప్రకారం ''ప్రియాంక చోప్రా గౌన్లు బాగా డిజైన్ చేయబడ్డాయి. ఆమెకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. ప్రియాంక ఫోటోలు మ్యాగజైన్‌లో విస్తృతంగా వ్యాపించాయి. మిగతా కంటెస్టెంట్స్ గ్రూప్ ఫోటోను పోస్ట్ చేశారు. అలాగే ఆ ​​సంవత్సరం మిస్ వరల్డ్ స్పాన్సర్‌లు భారతదేశానికి చెందినవారు. ఈ కారణాలన్నింటిని బట్టి.. 'ప్రియాంక చోప్రా రిగ్గింగ్ కారణంగా గెలిచింది' అని లెలానీ మెకోని ఆరోపించారు.

లెలానీ మెక్‌కోనీకి తన స్వంత యూట్యూబ్ ఛానెల్ ఉంది. వీటన్నింటినీ ఆ ఛానెల్‌లో విమర్శించారు. దీనిపై నెటిజన్లు అనేక రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మరి లెలానీ మెకోనీ ఆరోపణలపై ప్రియాంక చోప్రా స్పందిస్తుందా లేక మౌనంగా ఉంటుందా అనేది చూడాలి. సింగర్ నిక్ జోనాస్‌ని పెళ్లాడిన ప్రియాంక చోప్రా అమెరికాలో స్థిరపడింది. హిందీ సినిమాల కంటే హాలీవుడ్ సినిమాలనే ఎక్కువగా అంగీకరిస్తోంది. ఓ ప్రైవేట్ ఈవెంట్ కోసం ప్రియాంక మూడేళ్ల తర్వాత ఇటీవల ఇండియాకు తిరిగి వచ్చింది.

Next Story