పోప్ ఫ్రాన్సిన్ ఇక లేరు.. ప్రకటించిన వాటికన్

పోప్ ఫ్రాన్సిస్(88) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వాటికన్ సిటీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.

By Knakam Karthik
Published on : 21 April 2025 1:52 PM IST

International News, Pope Francis, Passes Away

పోప్ ఫ్రాన్సిన్ (88) ఇక లేరు.. ప్రకటించిన వాటికన్

పోప్ ఫ్రాన్సిస్(88) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వాటికన్ సిటీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్యం బాధ పడుతున్న ఆయన చివరి శ్వాస విడిచినట్లు వాటికన్ సిటీ అధికారికంగా ప్రకటించింది. మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోప్ తన నివాసంలో మరణించారని మాత్రమే వాటికన్ పేర్కొంది. కాగా అనారోగ్యంతో ఉన్న ఆయన నిన్న జరిగిన ఈస్టర్ వేడుకల్లో కూడా పాల్గొనలేదు.

1936 డిసెంబర్ 17న అర్జెంటీనాలో జన్మించిన ఆయన 2013 మార్చి 13న 266వ పోప్‌గా ఎన్నికయ్యారు. అమెరికా నుంచి పోప్‌గా ఎన్నికైన మొట్టమొదటి వ్యక్తిగా నిలిచారు. ఫిబ్రవరిలో శ్వాసకోస సమస్యలతో ఆస్పత్రిలో చేరి, ఆ తర్వాత కోలుకున్నారు. పోప్ మృతితో యావత్ క్రైస్తవ సమాజం శోకసంద్రంలో మునిగిపోయింది.

వలసదారుల కోసం పోప్ అవిశ్రాంతంగా వాదించడం వల్ల ఆయన మరణానికి కొన్ని నెలల ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస బహిష్కరణ విధానాలను తీవ్రంగా విమర్శించారు. జాతీయవాద ప్రజాదరణ పెరుగుదలకు పోప్ పదవి ప్రతిఘటనగా నిలిచిన ఫ్రాన్సిస్, తరచుగా అమెరికాలోని శక్తివంతమైన సంప్రదాయవాద కాథలిక్ శక్తుల నుండి విమర్శలకు గురయ్యారు

Next Story